Manchu Vishnu Gets Emotional After Surprise Gift From Ariana And Viviana - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: కూతుళ్లు చేసిన పనికి కంటతడి పెట్టుకున్న మంచు విష్ణు

Published Thu, Mar 2 2023 2:51 PM | Last Updated on Thu, Mar 2 2023 3:25 PM

Manchu Vishnu Gets Emotional over Surprise Gift From Viviana - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణుకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు ఆయన కూతుళ్లు అరియానా, వివియానా. బుధవారం (మార్చి 1న) మంచు విష్ణు- విరానికలు 15వ పెళ్లిరోజు జరుపుకున్నారు. పేరెంట్స్‌ పెళ్లిరోజును పురస్కరించుకుని వారికి మర్చిపోలేని బహుమతిచ్చారు అరియానా, వివియానా. వారికోసం ఓ బ్యూటిఫుల్‌ సాంగ్‌ ఆలపించారు. అంతే కాకుండా వారి  వివాహబంధంతో మొదలైన ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. విష్ణు దంపతుల ఫోటోలు, వీడియోలను ఒక స్పెషల్‌ వీడియోగా బయటకు వదిలారు.

ఇది చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యాడు. సదరు వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఎమోషనలయ్యాడు. 'ఈ పాట పూర్తయ్యే సమయానికి నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చేశాయి. నా డార్లింగ్‌ పిల్లలకు థాంక్యూ.. నా జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. నాకు, విరానికకు కలిపి ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను' అని రాసుకొచ్చాడు. ఈ వీడియోపై జెనీలియా స్పందిస్తూ.. 'అద్భుతంగా ఉంది విష్ణు. నీ పిల్లలు చాలా గొప్పవాళ్లు' అని కామెంట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement