పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్‌ | Sunny Leone Reveals Ex Fiance Cheated On Her 2 Months Before Wedding In Hawaii, Deets Inside - Sakshi
Sakshi News home page

Sunny Leone: పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు

Published Mon, Apr 8 2024 12:26 AM | Last Updated on Mon, Apr 8 2024 10:06 AM

Sunny Leone Reveals Ex Fiance Cheated On Her 2 Months Before Wedding - Sakshi

సన్నీలియోన్‌

‘ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు’ అన్నారు బాలీవుడ్‌ నటి సన్నీలియోన్ . హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ‘కరెంట్‌ తీగ’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్‌ ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్  గ్యాంగ్‌’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘స్ల్పీట్స్‌విల్లా’ అనే ఓ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సన్ని.

తాజాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ–‘‘కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని చాలా ప్రేమించాను. తన కూడా నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదో తప్పు జరుగుతోందని, అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నా మనసుకు అనిపించింది. దీంతో ‘నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. మరో రెండు నెలల్లో మా పెళ్లిని ప్లాన్‌ చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్  చేసుకున్నాం.

ఇందుకోసం అన్నీ బుక్‌ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పైగా పెళ్లి షాపింగ్‌ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తను అలా చెప్పడంతో నా మనసు ముక్కలైంది.. ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్‌ వెబర్‌ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయినప్పుడు తను ఎంతో అండగా నిలిచాడు. మా ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి (2011) చేసుకున్నాం. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement