
బాలీవుడ్‌లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. దీంతో 2012 నుంచి అలాంటి చిత్రాలు చేయడం మానేసి హిందీ చిత్రాలు, ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తూ శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.
కాగా ఈమె డేనియల్ వైబర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలకు (మగపిల్లలు) సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యారు. నిషాకౌర్ అనే కూతురు కూడా ఉంది. శృంగార తారగా రాణిస్తున్న సన్నీ లియోన్ తనకు సినిమా, వ్యక్తిగత జీవితం వేర్వేరు అంటోంది. ఈమెకు ఇప్పుడు దక్షిణాదిలోనూ క్రేజ్ ఉంది.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఐటెం సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకుంది. తమిళంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించడం ప్రారంభించింది. అలా ఓ మై ఘోస్ట్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న సన్నీ లియోన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను గ్లామరస్‌గా నటిస్తున్న సమయంలో తన పిల్లలు గాని, ఇతర పిల్లలు గాని అక్కడ ఉండడం ఇష్టపడనని చెప్పింది. వారు అక్కడ ఉంటే షూటింగ్ చేయడమే మానేస్తానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment