
బిడ్డలు ఆకలితో ఉంటే.. అమ్మ తపించిపోతూ ఉంటుంది. అమ్మ ప్రేమ అంటే అంతే మరి తన పిల్లలు ఆకలితో ఉంటే తట్టుకోలేదు. సన్నీలియోన్ తన పిల్లల ఆకలి తీర్చడానికి స్వయంగా రంగంలోకి దిగింది. వారికి ఇష్టమైన ఆహారపదార్థాలను సన్నీలియోన్ స్వయంగా వండి పెట్టింది. అయితే దీంట్లో విశేషం ఏముంది అని అంటే.. వంట చేసింది ఇంట్లో కాదండీ ఓ హోటల్‌లో. ఇదే విషయాన్ని సన్నీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
‘నోహ్, అషర్‌కు ఆకలి వేస్తుంది. వారికిష్టమైన బనానా కేక్, ఆపిల్ సాస్‌ను తయారు చేస్తున్నాను. నా పిల్లలకు కావల్సిన ఆహార పదార్థాలను తయారు చేసుకోడానికి ఈ హోటల్‌లోని కిచెన్ స్టాఫ్ నాకు అవకాశం ఇచ్చింది’ అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. ఓ రియాల్టి షోకు సంబంధించిన షూటింగ్ నిమిత్తం సన్నీలియోన్ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు.