Sunny Leone Opens up on Transition From Adult Entertainment to Bollywood - Sakshi
Sakshi News home page

Sunny Leone: 'నేను ఇండియా వెళ్లడం లేదు. వారంతా నన్ను ద్వేషిస్తారు': సన్నీ లియోన్

Published Tue, May 23 2023 7:39 PM | Last Updated on Tue, May 23 2023 8:13 PM

Sunny Leone opens up on transition from adult entertainment to Bollywood - Sakshi

సన్నీ లియోన్ ఇప్పుడు బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌ బాస్‌ షోతో ఫేమ్ తెచ్చుకున్న భామ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మహేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం జిస్మ్-2తో అరంగ్రేటం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత జాక్‌ పాట్, రాగిణి ఎంఎంఎస్, ఏక్ పహేలీ లీలా లాంటి చిత్రాల్లో కనిపించింది.

తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది బాలీవుడ్ భామ. ఈ వేడుకలో ప్రస్తుతం తాను హీరోయిన్‌గా నటిస్తోన్న కెన్నెడీ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. తాజా ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ అడల్ట్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కు మారే క్రమంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. 

(ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్‌ క్రేజీ అప్‌డేట్‌)

సన్నీ లియోన్ మాట్లాడుతూ..' మొదట నన్ను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించారు. కాల్ చేసి షోలో పాల్గొనాలని కోరారు. కానీ దీనిపై నేను  నా ప్రియుడు, భర్త డేనియల్ వెబర్‌తో మాట్లాడా. నీకు బుద్ధి లేదు. నేను ఇండియా వెళ్లడం లేదు. వారంతా నన్ను ద్వేషిస్తారు. ఎందుకంటే నేను ఇప్పటికే అడల్డ్ ఇండస్ట్రీలో ఉన్నా.' అంటూ సన్నీ చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ హౌస్ గురించి మాట్లాడుతూ.. 'అయితే ఈ షోకి రాకముందే నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. చంపేస్తామని బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి.  తాను బిగ్ బాస్‌లో దాదాపు 7 వారాల పాటు ఉన్నా. ప్రతి వారం గడిచేకొద్దీ ఏదో మంచి జరుగుతుందని ఆశించా. హౌస్‌లో ఉండగానే తనకు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఒక వ్యక్తిగా వారితో రిలేషన్ తర్వాత తాను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా.' అంటూ చెప్పింది.

(ఇది చదవండి: లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!)

బిగ్ బాస్ హౌస్‌లో అందరితో కలిసి వంటచేయడం, రోజువారీ జీవితం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్లే అడల్ట్ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. కానీ మధ్యలో తాను అనేక అడ్డంకులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్న కెన్నెడీ చిత్రంలో రాహుల్‌ భట్ సరసన నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement