
తారల మీద అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకునేవాళ్లు చాలామంది. అందులో భాగంగా చాలామంది వారి ఫేవరెట్ హీరోహీరోయిన్ల పేర్లను పచ్చబొట్టులు వేయించుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది. కానీ క్యాప్షన్‌లో మాత్రం.. 'ఇకపై నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. నీకు మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నా' అని కొంటెగా రాసుకొచ్చింది. సన్నీ ఫ్యాన్స్ ఆమె మీద అభిమానాన్ని చూపించడం ఇదేం కొత్తేం కాదు. గతంలో కూడా ఓ అభిమాని ఏకంగా ఆమె ముఖాన్ని తన పొట్టపై టాటూ వేయించుకున్నాడు.
చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!
Comments
Please login to add a commentAdd a comment