క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్‌లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే టెక్నిక్, శారీరక శ్రమతో సాగే ఆటల మైదానాల్లోనూ ఈ అదృష్టమే గెలుస్తుందన్న అభిప్రాయమూ ఉంది.. అందుకే అక్కడా నమ్మకాలు పందెం వేసుకుంటూంటాయి. ఆ రెండు రంగాల్లోని ఘనాపాటీల సెంటిమెంట్ల పోటీ ఇది..
తీన్ పత్తీ
మన దేశంలో.. ఆటల్లో క్రికెట్ మర్రి చెట్టులా వేళ్లూనుకుంది. ఇంకే ఆటకూ గ్రౌండ్ సరిపోనంతగా. అందుకే క్రికెట్ ప్లేయర్స్‌కున్నంత క్రేజ్.. గ్లామర్ మిగతా ఆటగాళ్లకు లేదు. వాళ్ల అలవాట్లు, ఆలోచనలూ వార్తలకెక్కలేదు. ఇక్కడ మాత్రం ఫుట్‌బాల్‌లో మన లెజెండ్ భైచుంగ్ భుటియా వింత అలవాటును ప్లేస్ చేద్దాం. అదేంటంటే.. తను ఫుట్‌బాల్ పిచ్‌లోకి ఎంటరయ్యే ముందు ‘తీన్ పత్తీ (మూడు ముక్కలాట)’ ఆడి మరీ వెళ్తాడట. దానివల్ల తన గేమ్.. తన టీమ్ విజయం సాధిస్తుందని భైచింగ్ విశ్వాసమట.
కచ్చితంగా చెక్ చేసుకుంటుంది..
ప్రీతి జింటాకూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. పరాయి ఊరు, దేశం ఇలా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా హోటల్లో బస బుక్ చేసుకునే ముందు అక్కడి బాత్రూమ్స్ గురించి వాకబు చేస్తుందట. శుభ్రంగా ఉంటాయనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేస్తుందట. అంతేకాదు హోటల్లోకి చెకిన్ అయ్యేకంటే ముందు బాత్రూమ్‌ని నీట్‌గా కడిగించాకే ఆ స్వీట్‌లోకి ఎంటర్ అవుతుందట. అదీ ఆమె ఓసీడీ.
కాళ్లు కడుక్కోవాల్సిందే
నటి సన్నీ లియోనికి పదే పదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందిట. ‘అలవాటు అంటారేంటండీ బాబూ.. అదో పిచ్చి’ అంటూ గుర్రుమంటారు ఆమెతో పనిచేసే వాళ్లు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట. ‘ఆ పిచ్చి వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్నదానికన్నా ఎంతో ఆలస్యంగా పూర్తయింది. దాంతో నిర్మాతలే కాదు యూనిట్ అంతా సఫర్ అయింది తెలుసా?’ అంటూ కామెంట్ చేస్తారు ఆ యూనిట్ సభ్యులు సెలబ్రిటీల సెంటిమెంట్స్ చర్చకు వచ్చినప్పుడల్లా.
ఇప్పటికీ? ఏమో మరి!
సినిమా వాళ్లకెన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ స్టార్స్‌కూ అన్నే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్ క్రికెటర్ విరాట్ కొహ్లీకున్న సెంటిమెంట్ లేక నమ్మకం గురించి చెప్పుకుందాం. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే వేసుకున్నాడో.. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అవే గ్లోవ్స్ వేసుకోవడం మొదలుపెట్టాడట ఈ బాట్స్‌మన్. దాన్ని అలవాటుగా స్థిరపరచుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశాడని చెప్తారు అతని సన్నిహితులు. ‘ఇప్పటికీ అవే గ్లోవ్స్ వాడతాడా?’ ఏమో.. మరి!
Comments
Please login to add a commentAdd a comment