sentiments
-
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హిందూ సేన జాతీయాధ్యక్షుడు విష్ణు గుప్తా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ చిత్రం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రామాయణాన్ని, అలాగే శ్రీరాముడిని, భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేసినట్లు ఉందని పిటిషన్లో పేర్కొన్నారాయన. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదనేది హిందూ సేన ప్రధాన అభ్యంతరం. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో, అలాగే తులసీదాస్ రచించిన రామచరితమానస్‌లోనూ ప్రధాన పాత్రల వర్ణనకు.. ఆదిపురుష్‌లో పాత్రలను చూపించిన తీరుకు చాలా తేడాలు ఉన్నాయని పిటిషన్లో ప్రస్తావించారు. హిందూ దేవుళ్లైన రాముడు, సీత, హనుమంతుడు, రావణుడికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని లేదంటే సరిదిద్దడానికి చిత్రయూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ముఖ్యంగా రావణ బ్రహ్మ పాత్రధారి(సైఫ్ అలీఖాన్)ను గడ్డంతో ఏదో క్రూరుడిగా చూపించినట్లు ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది హిందూ సేన. ప్రామాణికమైన వాల్మీకి రామాయణం గురించి తెలుసుకోవాలంటే పండితుల్ని, సాహిత్యకారుల్ని సంప్రదించాల్సిందేనంటూ ఈ చిత్ర ప్రారంభంలోనే నోట్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ఆదిపురుష్ ఆ ఓటీటీలోనే.. వచ్చేసిన క్లారిటీ -
మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి
గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్ రోడ్డులో ఒక నీరా హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి. హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు. అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్‌ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల -
సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద. ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆరోగ్యం బాలేకపోయినా ఆమెయశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సమంత చేతికి ధరించిన ఉంగరాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పడింది. ఎప్పుడూ డిజైనర్ వేర్ జ్యువెలరీలో కనిపించే సామ్ తొలిసారిగా ఇలా జాతకాల ప్రకారం రంగురాళ్లను ధరించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా భాదపడుతున్న సమంత 'మయోసైటిస్' అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సమంత ఈమధ్యకాలంలో జాతకాలను కూడా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె చేతికి రంగురాళ్లను ధరించనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఉంగరాల్లో ఒకటి కనకపుష్యరాగం ఒకటి. ఇది సంపద, ఆరోగ్యానికి శుభసూచికంగా భావిస్తారట. దీంతో పాటు ఆమె గోమేధకం అనే మరో ఉంగరాన్ని కూడా ధరించింది. ఇది చెడు దృష్టి నుంచి కాపాడుతుందట. దీన్ని ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా సత్పలితాలు ఉంటాయట. ఇక సమంత ధరించిన మరో ఉంగరం ముత్యం.. ఇది చంద్రుడు ఒక్కో క్షణంలో బలహీనంగా మారినపుడు ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడకుండా ఉండేలా ఈ ఉంగరాన్ని ధరిస్తారట. మొత్తానికి దీన్ని బట్టి సమంత సెంటిమెంట్లను బాగానే ఫాలో అవుతుందనే టాక్ వినిపిస్తుంది. -
వింత సెంటిమెంట్: విరాట్ చేతికి అవే గ్లోవ్స్. ఆ నటి కాళ్లు కడుక్కోవాల్సిందేట!
క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్‌లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే టెక్నిక్, శారీరక శ్రమతో సాగే ఆటల మైదానాల్లోనూ ఈ అదృష్టమే గెలుస్తుందన్న అభిప్రాయమూ ఉంది.. అందుకే అక్కడా నమ్మకాలు పందెం వేసుకుంటూంటాయి. ఆ రెండు రంగాల్లోని ఘనాపాటీల సెంటిమెంట్ల పోటీ ఇది.. తీన్ పత్తీ మన దేశంలో.. ఆటల్లో క్రికెట్ మర్రి చెట్టులా వేళ్లూనుకుంది. ఇంకే ఆటకూ గ్రౌండ్ సరిపోనంతగా. అందుకే క్రికెట్ ప్లేయర్స్కున్నంత క్రేజ్.. గ్లామర్ మిగతా ఆటగాళ్లకు లేదు. వాళ్ల అలవాట్లు, ఆలోచనలూ వార్తలకెక్కలేదు. ఇక్కడ మాత్రం ఫుట్‌బాల్‌లో మన లెజెండ్ భైచుంగ్ భుటియా వింత అలవాటును ప్లేస్ చేద్దాం. అదేంటంటే.. తను ఫుట్‌బాల్ పిచ్‌లోకి ఎంటరయ్యే ముందు ‘తీన్ పత్తీ (మూడు ముక్కలాట)’ ఆడి మరీ వెళ్తాడట. దానివల్ల తన గేమ్.. తన టీమ్ విజయం సాధిస్తుందని భైచింగ్ విశ్వాసమట. కచ్చితంగా చెక్ చేసుకుంటుంది.. ప్రీతి జింటాకూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. పరాయి ఊరు, దేశం ఇలా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా హోటల్లో బస బుక్ చేసుకునే ముందు అక్కడి బాత్రూమ్స్ గురించి వాకబు చేస్తుందట. శుభ్రంగా ఉంటాయనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేస్తుందట. అంతేకాదు హోటల్లోకి చెకిన్ అయ్యేకంటే ముందు బాత్రూమ్ని నీట్‌గా కడిగించాకే ఆ స్వీట్‌లోకి ఎంటర్ అవుతుందట. అదీ ఆమె ఓసీడీ. కాళ్లు కడుక్కోవాల్సిందే నటి సన్నీ లియోనికి పదే పదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందిట. ‘అలవాటు అంటారేంటండీ బాబూ.. అదో పిచ్చి’ అంటూ గుర్రుమంటారు ఆమెతో పనిచేసే వాళ్లు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట. ‘ఆ పిచ్చి వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్నదానికన్నా ఎంతో ఆలస్యంగా పూర్తయింది. దాంతో నిర్మాతలే కాదు యూనిట్ అంతా సఫర్ అయింది తెలుసా?’ అంటూ కామెంట్ చేస్తారు ఆ యూనిట్ సభ్యులు సెలబ్రిటీల సెంటిమెంట్స్ చర్చకు వచ్చినప్పుడల్లా. ఇప్పటికీ? ఏమో మరి! సినిమా వాళ్లకెన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ స్టార్స్‌కూ అన్నే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్ క్రికెటర్ విరాట్ కొహ్లీకున్న సెంటిమెంట్ లేక నమ్మకం గురించి చెప్పుకుందాం. కెరీర్లో ఫస్ట్ టైమ్ మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే వేసుకున్నాడో.. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అవే గ్లోవ్స్ వేసుకోవడం మొదలుపెట్టాడట ఈ బాట్స్మన్. దాన్ని అలవాటుగా స్థిరపరచుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశాడని చెప్తారు అతని సన్నిహితులు. ‘ఇప్పటికీ అవే గ్లోవ్స్ వాడతాడా?’ ఏమో.. మరి! -
హృతిక్ చేతికి ఆరో వేలు..సర్జరీకీ ససేమిరా, కారణం ఇదేనట!
వినోద రంగంలో సెంటిమెంట్లు, జాతకాలు, గుడ్డి నమ్మకాలకు విలువెక్కువ. ప్రతిభ కన్నా అదృష్టానికి గౌరవం ఎక్కువ. అందుకే ఆ ప్రభావం ప్రొడ్యూసర్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీస్.. వాళ్ల నమ్మకాలను పట్టుకొచ్చాం ఈ శీర్షిక కోసం.. అసౌకర్యం కాదు అదృష్టం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో.. ఆరువేళ్ల అందగాడు హృతిక్ రోషన్ ఒక చేతికున్న ఆ ఆరోవేలుతో చాలా అసౌకర్యంగా ఉన్నా.. భరిస్తూ ఉంటాడు. ‘అంత భరించాల్సిన అవసరం లేదు భై.. సర్జరీతో సిక్త్ ఫింగర్‌ను తీసేయొచ్చు..’ అని డాక్టర్లు సూచించినా.. ససేమిరా అన్నాడట ఆ హీరో. కారణం.. అతనింట్లో పెద్దవాళ్లు ‘ఆ ఆరోవేలే నీ అదృష్టం’ అని సెలవిచ్చారట. సో.. అదలా కంటిన్యూ అవుతోందన్నమాట. అతని చేతికి ఆ ఆరోవేలు కనిపించినంత కాలం ఆ అంధవిశ్వాసాన్ని ఆ హీరో ఫాలో అవుతున్నట్టే అని అభిమానులు ఫిక్స్ అయ్యారట కూడా. ‘కె’ క్వీన్ టెలివిజన్ డ్రామా క్వీన్.. ఏక్తా కపూర్ విజయ రహస్యమేంటనుకుంటున్నారూ.. సాస్, బహూ సీరియల్స్ అనా? కాదు.. కానే కాదు.. ‘కె’ వర్డ్ .. సీక్రెట్ ఆఫ్ హర్ సక్సెస్. ఒక్కసారి ఆ సీరియల్స్‌ను గుర్తు తెచ్చుకోండి.. క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ, కుమ్కుమ్ భాగ్య, కుండలి భాగ్య, కసౌటీ జిందగీ కే, కసమ్, కసమ్ సే, కలశ్ ఏక్ విశ్వాస్, కవచ్, కస్తూరీ ఎట్సెట్రా.. అన్నీ ఇంగ్లిష్ ‘కె’ వర్డ్ లేదా హిందీ ‘క’ పదంతో మొదలైనవే. ఒకవేళ తొలి అక్షరం ‘కె’ తో స్టార్ట్ అవకపోయినా సీరియల్ టైటిల్లో ఎక్కడైనా ‘కె’ ఉండేట్టు చూసుకుంటుందట ఏక్తా. ‘నా పర్యవేక్షణలో ఉండే సీరియల్స్ టైటిల్స్ విషయంలో నాకు ఈ కె సెంట్మెంట్ ఉన్న మాట నిజమే. అయితే చాలా మంది దాన్ని మూఢ నమ్మకం అంటారు. కానీ నాకైతే అది ఒక నమ్మకం. ఎవరేమనుకున్నా నేనేం ఫీలవను’ అంటుంది ఏక్తా కపూర్. అవుటాఫ్ కంట్రీ..| హీరో అక్షయ్ కుమార్‌కు.. ప్రాక్టికల్ మ్యాన్ అని కితాబు బాలీవుడ్లో. కానీ తన సినిమా విడుదల సమయం ఆసన్నమయ్యే సరికి సెంటిమెంటల్ ఫూల్‌లా వ్యవహరిస్తాడనీ కామెంట్.. అదే ఇండస్ట్రీలో. తన సినిమా రిలీజ్ అప్పుడు తాను ఇండియాలో ఉంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టదని భయమట అతనికి. అందుకే రిలీజ్ డేట్ డిసైడ్ కాగానే విదేశానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలా సినిమా రిలీజ్‌కు తను దేశంలో లేనప్పుడల్లా ఆ సినిమా కమర్షియల్‌గా సూపర్ డూపర్ హిట్ అవడం.. ఇక్కడే ఉంటే ఫట్ అవడం.. అతనిలో ఆ సెంట్మెంట్ బలపడ్డానికి కారణమట. హే..వి..టో!! సిల్లీ... శిల్పా శెట్టి నటే కాదు ఐపీఎల్ క్రికెట్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా. నటిగా క్షణం తీరికలేని షెడ్యూల్స్‌ను హ్యాండిల్ చేసినప్పుడు ఆమెకు ఎలాంటి నమ్మకాలుండేవో కానీ రాజస్థాన్ రాయల్స్‌కు యజమాని అయింతర్వాత మాత్రం సిల్లీ (అని ఆమే అంటుంది) సెంటిమెంట్లను ఫాలో అవుతోందట. అవేంటో ఆమె మాటల్లోనే విందాం.. ‘ ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌కు వెళ్లేప్పుడు మరచిపోయి రెండు వాచ్‌లు పెట్టుకెళ్లాను. అప్పుడు మా జట్టే గెలిచింది. ఇంకోసారి మా జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్గా కూర్చోని.. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌కి రాగానే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను.. అప్పుడూ మా టీమే గెలిచింది. తర్వాత ఒకట్రెండు మ్యాచ్‌లకూ అలాగే రెండ్ వాచ్‌లు పెట్టుకెళ్లడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం.. ఆ మ్యాచ్‌లూ గెలవడంతో ఆ అలవాట్లను సెంటిమెంట్లుగా మార్చేసుకున్నాను. సిల్లీనే.. కానీ సెంట్మెంట్ ఈజ్ సెంట్మెంట్ కదా..’ అంటూ కనుబొమలు ఎగరేస్తూ .. పళ్లు కనపడకుండా నవ్వుతుంది శిల్పా శెట్టి. -
గిరిజనుల మనోభావాలను కేద్రం దెబ్బ తీసింది: మంత్రి హరీష్ రావు
-
కళ్ల నిండా ఆనందం
ఊరూ వాడా ఒకటే చర్చ.. ఎక్కడ నలుగురు గుమిగూడి ఉన్నా అదే మాటలు.. ‘సుబ్బమ్మత్తా.. నీ స్థలం ఎక్కడ? రాములమ్మా నీ ప్లాటెక్కడే? శ్రీదేవొదినా నీక్కూడా స్థలం వచ్చిందా?’ అంటూ చర్చోపచర్చలు. పేర్లు మారినా మూడు రోజులుగా ఊరూరా ఇవే సంభాషణలు. దేశంలోనే ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల క్రితం ఏకంగా 30.70 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా ఉచితంగా కట్టించి ఇస్తామని ప్రకటించడం పట్ల లబ్ధిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో సొంతింట్లో ఉండగలమా.. అనే ప్రశ్న వేధించేదని, జగన్ పుణ్యమా అని ఇక ఆ ప్రశ్నకు తావేలేదని ఆనందం నిండిన కళ్లతో చెబుతున్నారు. పేదల సంక్షేమం కోసం పరితపిస్తున్న జననేతకు వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టా అందుకుని సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన లబ్ధిదారుల మనోగతాలు ఇలా ఉన్నాయి. – సాక్షి నెట్వర్క్ నా మనవడు జగన్ వల్లే సొంతిల్లు మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు. వలంటీర్ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది. – అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా 12 సార్లు అర్జీ పెట్టినా రానిది.. 14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరువలేము. – తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా ఇన్నాళ్లూ తిరిగి తిరిగి అలసిపోయాం సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్‌కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా ఇప్పుడు ఆ భయం లేదు పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎవరూ చేయని మేలును సీఎం జగన్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలను చదివించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలోచన మళ్లీ రాలేదు. ఆ భయం లేదు. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంటి స్థలం ఒక్కసారి దరఖాస్తు చేయగానే వచ్చింది. – విజయలక్ష్మి, దండోరా కాలనీ, కడప చెప్పలేనంత ఆనందంగా ఉంది బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం. – సింహాద్రి సంతోషి, ఎస్.కోట, విజయనగరం జిల్లా టీడీపీ వాళ్లమైనప్పటికీ ఇల్లు మంజూరు నా భర్త ఓ ప్రైవేట్ స్కూల్లో వాచ్మెన్. తిరుపతి శివజ్యోతి నగర్లో 40 ఏళ్లుగా కాపురం ఉంటున్నాం. అనేకసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేదు. ఇప్పుడు వార్డు వలంటీర్ మా ఇంటికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలివ్వాలని అడిగారు. ఇన్నేళ్లు రాని ఇంటి పట్టా ఇప్పుడు వస్తుందా..? అనుకున్నాను. వలంటీర్ బలవంతంగా దరఖాస్తు చేయించింది. ఎవరి సిఫార్సు లేకుండానే ఇల్లు కూడా మంజూరవడంతో ఆశ్చర్యపోయాం. కొన్నేళ్లుగా టీడీపీ సానుభూతిపరురాలుగా ఉన్న నాకు సీఎం జగన్ వల్లే స్థలం వచ్చింది. ఇల్లు కూడా కట్టిస్తున్నారంటే ఆనందంగా ఉంది. చిరకాల స్వప్నం నెరవేర్చారు. – ఎన్.వనజాక్షి, శివజ్యోతినగర్, తిరుపతి నిజంగా ఇది పేదల ప్రభుత్వం రోడ్డు పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాటాకు పాక వేసుకుని జీవిస్తున్నాం. భర్త చనిపోయి పదేళ్లవుతుంది. కూతురుతో కలసి పాకలోనే ఉంటున్నాం. టిడ్కో ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం రూపాయికే ఇల్లు మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇంటికి 20 ఏళ్లు పాటు బ్యాంకు రుణం చెల్లించాలని చెప్పితే జగన్ ఒక్క రూపాయి కడితే చాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఆనందంగా ఉంది. నిజంగా ఇది పేదల ప్రభుత్వం. – మాకిరెడ్డి రమణమ్మ, నర్సీపట్నం మున్సిపాలిటీ, విశాఖ జిల్లా అన్నలా ఆదుకుంటున్నాడు పేదరికంతో కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇంటి స్థలం జగనన్న ఇచ్చారు. సొంత అన్నలా ఆడపడుచులను ఆదుకుంటున్నారు. 30 ఏళ్లుగా ఇంటి స్థలం కోసం ఎన్నో అర్జీలు పెట్టినా పట్టించుకోలేదు. జగనన్న ప్రభుత్వంలో దరఖాస్తు పెట్టిన వెంటనే ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పేదల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. – చందన భాస్కరలక్ష్మి, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్నాళ్లూ ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు ఇప్పట్లో సొంత ఇల్లు వచ్చే అవకాశం లభిస్తుందని అనుకోలేదు. మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంటిలో నివాసముంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విడిగా అద్దె ఇంట్లో ఉండాలంటే మా ఆదాయం సరిపోవటం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం లేదా అని అనుకుంటున్న సమయంలో సీఎం జగన్ చెప్పడంతో ఇంటి స్థలానికి దరఖాస్తు పెట్టుకున్నా. నాకు ఇంటి స్థలం పట్టా మంజూరైంది. ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. మా ఊహలను నిజం చేసిన జగనన్నకు రుణపడి ఉంటాం. – కె.శారద, చినగంజాం, ప్రకాశం జిల్లా దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు మాది చాలా పేదరికం. 20 ఏళ్ల క్రితం నా భర్తను కిడ్నీ వ్యాధి మహమ్మారి కబళించింది. పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులు చేసుకుని బతుకు సాగిస్తున్నా. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా రాలేదు. కూలి డబ్బులు అద్దెలకు పోస్తే నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని మదన పడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చింది. వలంటీర్ వచ్చి ఇంటి స్థలం మంజూరవుతుందని వివరాలు తీసుకుని వెళ్లారు. తర్వాత నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే ఆనందం వేసింది. ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు. ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. – జోగి మోహిని, గుణుపల్లి, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ఇది మా కుటుంబానికి తొలి ఆస్తి నా పేరు షేక్ నసీమా. 25 ఏళ్లుగా కుటుంబం మొత్తం అద్దె ఇంట్లోనే సర్దుకుపోతున్నాం. గతంలో ఎన్నోసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి పట్టా మంజూరు చేశారు. ఇది మా కుటుంబానికి చేకూరిన తొలి ఆస్తి. ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తుండటం పట్ల ఆనందంగా ఉంది. సీఎం జగన్ చెప్పినవన్నీ చేసుకుపోతున్నాడు. – షేక్ çనసీమా, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా జీవితాంతం గుడిసె తప్పదనుకున్నాం కూలికి పోతే తప్ప పూట గడవని పరిస్థితి. గ్రామంలో వేరేవారి స్థలంలో గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నాం. జీవితాంతం ఇదే గుడిసెలో కాలం ఈడ్చాలని అనుకునే వాళ్లం. నా భర్త హనుమంతప్ప, నలుగురు పిల్లలు ప్రతి రోజూ కూలికి పోయి జీవనం గడుపుతున్నాం. జీవితంలో సొంతిల్లు కట్టుకోలేమనే భావనతో ఉన్న మాకు సీఎం జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. ఇంటి పట్టా అందుకున్న వేళ మా ఆనందం చెప్పలేం. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతుంటే సంతోషంతో మాటలు రావడం లేదు. – అయ్యమ్మ, పెద్ద తుంబళం గ్రామం, కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా ఊరందూరులో ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం తాళ్లకోడు వద్ద వేసిన లే అవుట్ విజయనగరం జిల్లా గుంకలాం వద్ద పేదల కోసం ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలు -
ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా: ఎమ్మెల్యే ఫైర్
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: పవిత్రమైన కామాక్షితాయి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా, భక్తుల మనోభావాలను గౌరవించరా అంటూ ఈఓ కృష్ణారెడ్డిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో సోమవారం రాత్రి మహిళలు వెలిగించిన కార్తీకదీపాలను తాత్కాలిక ఉద్యోగి శేషురెడ్డి నీళ్లతో ఆర్పివేసిన విషయం సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆలయానికి విచ్చేశారు. కార్తీకదీపాలు ఆర్పివేసిన ప్రాంతాన్ని పరిశీలించా రు. కార్తీకదీపాలు ఆర్పివేయాలని ఎవరు చెప్పారని శేషురెడ్డిని ప్రశ్నించారు. కార్తీకమాసం మహిళలకు ఎంతో పవిత్రమని, ఈ క్రమంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ వెలిగించిన కార్తీకదీపాలను ఆర్పివేయడం ఏమిటని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తుల విషయంలో ఇలా వ్యవరిస్తారా అని ప్రశ్నించారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైనదన్నారు. పూజారులు, ఉద్యోగులు రాజకీయాలు చేస్తూ ఆలయాని అభాసుపాలుచేస్తున్నారన్నారు. కామాక్షితాయి అమ్మవారిని కొలిచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలు కించపరిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. వెంటనే శేషురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహించారని కృష్ణారెడ్డిపై మండిపడ్డారు. ఉద్యోగి శేషురెడ్డిని తొలగిస్తున్నట్లు ఈఓ తెలిపారు. పరిశుభ్రత పాటించరా ఆలయం పరిసరాలతో పాటు చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉండడంపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఈఓను ప్రశ్నించారు. ఆలయంలో పగిలిన చెత్తకుండీలుండడం, పెన్నానదికి వెళ్లేమార్గంలో పారిశుద్ధ్యం తిష్టవేసి దుర్గంధం వెదజల్లడం, ఆలయ వ్యర్థపు నీరు పెన్నానదిలో కలవడంపై ఎమ్మెల్యే ఈఓపై మండిపడ్డారు. పూజాసామగ్రి తదితరాలకు చెందిన సామగ్రి వేసేందుకు పగిలిన చెత్తకుండీలు ఏర్పాటు చేయడం ఏమిటని అడిగారు. కొత్త కుండీలు ఎక్కడని ప్రశ్నించారు. ఆలయం ముందు పెన్నానదికి వెళ్లే మార్గంలో ఉన్న దుర్గంధం వెదజల్లుతున్న చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన పెన్నానదిలో ఆలయం నుంచి వ్యర్థపునీరు కలవడంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయం పరిసరాలతో పాటు బ్రిడ్జిపై మందుబాబుల జోరు ఎక్కువగా ఉంటే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. ఎమ్మెల్యే వెంట సీఐ సురేష్ బాబు, ఎస్సై జిలానీబాషా, పార్టీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి, చీమల రమేష్‌బాబు, టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి, షేక్ అల్లాభక్షు, పిల్లెళ్ల మోహన్‌మురళీకృష్ణ, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, నాపా వెంకటేశ్వర్లు నాయు డు, పిల్లెళ్ల సాగర్, నాటారు బాలకృష్ణ ఉన్నారు. -
సారీ..!
అంటోంది భూమి ఫెడ్నేకర్. ఎందుకు? మ్యారిటల్ రేప్ మీద వ్యంగ్యంగా కామెంట్ చేసినందుకు. అఫ్కోర్స్ స్క్రీన్ మీదే అనుకోండి.. అయినా స్త్రీవాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భూమి ఫెడ్నేకర్, కార్తీక్ ఆర్యన్ నటించిన ‘పతీ పత్నీ ఔర్ వోహ్’ సినిమా ట్రైలర్‌కు సంబంధించిన విషయం ఇది. ఈ ట్రైలర్లో హీరో ఆర్యన్ కార్తీక్ పాత్ర ‘‘భర్త నానా తంటాలు పడి.. కిటుకులు, గిమ్మిక్కులతో కష్టపడి భార్యను ‘ఒప్పిస్తే’ ఆ భర్తను రేపిస్ట్‌గా ముద్రేస్తారు’’ అని అంటాడు. ఈ డైలాగ్ వివాదమైంది. దాంతో భూమి ఫెడ్నేకర్ ‘‘మ్యారిటల్ రేప్ అనే సీరియస్ అంశాన్ని అపహాస్యం చేయాలని, వాళ్లను బాధపెట్టాలనే ఉద్దేశం మాకెంతమాత్రం లేదు. అయినా ఈ డైలాగ్ వల్ల కొంతమంది బాధపడ్డారు. క్షమించండి’’ అంటూ సారీ చెప్పింది. సమాజంలో మ్యారిటల్ రేప్ మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పతీ పత్నీ ఔర్ వోహ్ లోని హీరో పాత్ర చెప్పే డైలాగ్ నిజంగానే.. ఈ అంశం సీరియస్‌నెస్‌ను తగ్గించేదిగానే ఉంది. భార్య మనసు గెలుచుకోవాల్సింది కిటుకులు, పొగడ్తలతో కాదు.. ఇంటి బాధ్యతల్లో, సహజీవన ప్రయాణంలో సమభాగస్వామిగా గౌరవం ఇచ్చి. ఇలా అర్థం వచ్చేలా సీన్స్ ఉంటే సారీ చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా! అడుసు తొక్కనేలా? కాలు కడగనేలా? విషయాన్ని అపహాస్యం చేయనేలా? సారీ చెప్పనేల? -
మీకు సెంటిమెంట్స్ ఎక్కువా..?
సెంటిమెంట్స్ ప్రతివాళ్లకూ ఎంతో కొంతమేర ఉంటాయి. అవి సహజం కూడా. సెంటిమెంట్ల విషయంలో మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉంటారో, పర్టిక్యులర్‌గా ఉంటారో చెక్ చేసుకోండి. 1. అర్జెంట్ పనిమీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే...ఆ పని నలుగురితో కలిసి వెళ్లాల్సినదైతే అలాగే సాగిపోతారు. అంతేగాని ఆగరు. ఎ. అవును బి. కాదు 2. మీరు రెగ్యులర్‌గా ముఖం చూసి లేచేవారి ముఖం చూడని రోజున ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వేళ కనబడ్డ వారిని ద్వేషించరు. అది యాదృచ్ఛికం అని సర్దుకుపోతారు. ఎ. అవును బి. కాదు 3. ముహూర్తాలపై నమ్మకం ఉన్నా... మీరు బయల్దేరాలనుకున్న ఆ సమయం మీ ప్రయాణానికి అనువుగా లేకపోతే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతారు. ఎ. అవును బి. కాదు 4. పరీక్ష విజయవంతంగా రాసేందుకు దోహదం చేస్తుందనే పెన్ను పైనగాని, షర్ట్పైగాని మీకు సెంటిమెంట్ ఉంటే... ఒకవేళ అందుబాటులో లేకపోతే కొత్తదానితో ప్రొసీడ్ అవ్వగలరు. ఎ. అవును బి. కాదు 5. పరీక్షలయ్యాక ఫలానా థియేటర్లో సినిమా చూడాలనే సెంటిమెంట్ ఉన్నా ఆ పూట టిక్కెట్లు దొరకకపోతే మీరు బాధపడరు. ఎ. అవును బి. కాదు 6. మీరు రోజూ పొద్దున్నే దినఫలాలు యథాలాపంగా చూస్తారు గాని... మళ్లీ అవి గుర్తుండవు. మీ రోజు గడిచిన తీరును దానికి ఆపాదించరు. ఎ. అవును బి. కాదు 7. పర్స్ వంటి వాటిపై సెంటిమెంట్ ఉన్నా, అది పూర్తిగా చిరిగిపోతే కొత్తది కొనుక్కుంటారు. ఎ. అవును బి. కాదు 8. విధి రాతను మీరు నమ్మినా, మీ ప్రయత్నాల వల్లనే మీకు విజయాలు లభిస్తాయని తెలుసు. పూర్తిగా విధినే నమ్ముకుని, మీరు చేయాల్సిన వాటిని గాలికి వదిలేయరు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరుకు మించి వస్తే మీకు సెంటిమెంట్స్ ఉన్నా వాటికి మీరు బానిస కాదు. ‘బి’ సమాధానాలు ఆరు దాటితే మీరు సెంటిమెంట్లను బలంగా నమ్ముతారు. సెంటిమెంట్ ఆత్మవిశ్వాసం కలిగించేదిగా ఉండాలి గాని దినచర్యకు అడ్డంకిగా మారకూడదు. సెంటిమెంట్ స్థాయిని మించి మూఢనమ్మకంగా మారుతుంది. కాబట్టి ఒకవేళ మీలో సెంటిమెంట్స్ ఉన్నా మీ జీవితంలో వాటి జోక్యాన్ని మితిమీరనివ్వవద్దు -
ఆస్తులూ-సెంటిమెంట్లూ
అక్షర తూణీరం ఆ రోజుల్లో ఫియట్ కారంటే గొప్ప. పీఎస్ చారి అని మా ఆఫీసు పెద్ద సారువాడుండే వాడు. చాలా రూల్స్ మనిషి. ఈయన పెద్ద వట్టివేళ్ల తడి కండీ అని పనులమీద వచ్చి వెళ్లేవారు వ్యాఖ్యానించేవారు. గీరు నామంతో, ఖద్దరు కట్టుతో చారి చాలా నిరాడంబరంగా కనిపించేవారు. ఎప్పుడూ తడుపుతూ ఉంటే గానీ వట్టివేళ్ల తడిక సుఖంగా పనిచెయ్యదు, చారి కూడా అదే బాపతని ఒకాయన వివరించాక మర్మం నాకు బోధపడింది. ఇట్లాంటి వారికి గొప్ప చిక్కు ఏంటంటే, గడ్డితిని సంపా యిస్తారు గాని సుఖంగా ఏ భోగమూ అనుభవించలేరు. సర్వీస్ ఉండగా భయం. దిగిపోయాక్కూడా భయమే. ఎవడైనా ఓ ఆకాశరామన్న ఉత్తరం రాస్తాడేమోనని. ఉన్నట్టుండి చారి ఫియట్ కారులో ఆఫీసుకు వచ్చాడు. అంతా నివ్వెరపోయారు. ఎవరూ విస్తుపూర్వక ప్రశ్నలు సంధించకముందే, చారి ఫియట్ వృత్తాంతాన్ని వివ రించాడు. డీలర్ దగ్గర ఖాళీగా పడి ఉందిట. టైర్లు, సీట్లు ఎలుకలవల్ల హరించాయిట. ఉద్యమ వేళ అద్దాలు వడ గళ్లుగా నేలపై రాలాయిట. డీలర్‌ని అడిగితే, మీరు అడి గారని చెబుతున్నా నాలుగువేలిచ్చి తీసికెళ్తారా అని అడిగాట్ట! ఫియట్ కారు ఆయన జీవితాశయమని లోగడే చారి పలుమార్లు చెప్పారు. సరేనని తెగించి వాయిదాల పద్ధతిలో తీసుకున్నాట్ట. సీట్లు మిసెస్ చారి కుట్టిందిట. కొడుకు పాత టైర్లు సేకరించి, స్వయంగా ఫియట్‌కి రంగులు, హంగులు కూర్చాడట. మొత్తం ఐదువేల ఆరువందల పన్నెండు రూపాయలు అయిం దని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు చారి. చారి చెప్పిన తీరులో ఒక నిజాయితీ ధ్వనించింది. అయినా నమ్మశక్యం కాలేదు. మొన్న మన ప్రియతమ నేత స్థిర చరాస్తులు ప్రకటించగానే నాటి మా చారి గుర్తొచ్చారు. విశాలంగా, సర్వ సదుపాయాలతో ఇల్లు కట్టుకోవడం సంతోషమేగానీ మరీ మూడుకోట్లు అప్పు చేయడమేమిటని మావూరి రచ్చబండ జాలిపడింది. దాదాపు అర్ధ శతాబ్ది రాజకీయ జీవితం, పెళ్లినాటికే మంత్రిపదవి, ఆ తర్వాత సరేసరి. అందరికీ తెలిసిందే. ప్రజల కోసం జీవితం ధారపోస్తున్న నాయకుడు, పైగా వయసు మీద పడింది కూడా. ‘ఇప్పుడు రుణభారం పెట్టుకోవడమా పాపం’ అంటూ ఒకరిద్దరు పెద్ద మను షులు బాధపడ్డారు. ఏముంది మనమంతా తలా పావలా వేసుకున్నా బిల్డింగ్ లేచిపోతుందని ఒకాయన లెక్క తేల్చాడు. ఉన్నట్టుండి మావూరి సర్పంచ్‌కి ఆవేశం వచ్చింది. నేను కూడా ప్రజా జీవితంలో ఉన్నానుగందా. నే కూడా నా ఆస్తులు డిక్లేర్ చేస్తున్నా రాసుకోండ్రా అంటూ లేచి నిలబడ్డాడు. పాత పెంకుటింటితో మొదలుపెట్టి, చింకి చాపలు, విరిగిన ఎడ్లబండి, తుప్పట్టిన బోరింగు గొట్టాలు, ఒట్టిపోయిన గేదె దూడతో సహా చెప్పు కుంటూ వెళ్లాడు. రచ్చబండ మీది నలుగురూ వాటి వాటి ధరలు నిర్ణయించి చెబుతుంటే, ఓ కుర్రాడు అంకెలు కూడుకున్నాడు. పదివేల చిల్లరకు వచ్చింది మొత్తం. సర్పంచ్ ఒక్కసారి తేలుకుట్టినట్టు అరిచాడు. మా మాంగారు అలకల్లో ఇచ్చిన సైకిల్రోయ్ అనగానే, వేసుకో పన్నెండు రూపాయలన్నారు పెద్దలు. సర్పంచ్ ససేమిరా అన్నాడు. ఆ సైకిల్లో బోలెడు సెంటిమెంట్లు న్నాయి. కనీసం ఒక లక్షన్నా పడాల్సిందే అంటూ వాదించాడు. మొత్తానికి మా సర్పంచ్ ఆస్తుల ప్రకటనైతే అయి పోయింది. శ్రీరమణ