ఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక దుర్భర పరిస్థితిన ఎదుర్కొంటున్నారు. వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చారు. ఢిల్లీలోని పదివేల మంది వలస కూలీల కడుపు నింపేందుకు పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)ఇండియాతో చేతులు కలిపింది. ఉదయ్ ఫౌండేషన్ ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహాన్ని ఢిల్లీలోని వలస కార్మికులకు అందించనుంది.
ఇక ఇదే విషయంపై సన్నీలియోన్ మాట్లాడుతూ..ప్రస్తుతం మనమందరం సంక్షబాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో దయ, కరుణతో అందరి ముందుకు వచ్చి పేదలకు సహాయం అందించాలి. పెటా ఇండియాలో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం పేదవాళ్లు ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్య ఇది. వేలాది మంది కార్మికులకు మంచి పౌషికాహారాన్ని అందించబోతున్నాం. ఈ సమయంలో వారికి ఇది ఎంతో అవసరం అని పేర్కొంది. గతంలోనూ భర్తతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేసిన సన్నీ ఉదారతను మరోసారి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రియల్ స్టార్ అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సన్నీలియోన్ ‘షెరో’, ‘రంగీలా’ అనే చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు తెలుగు, హిందీల్లో రూపొందుతున్న ‘హెలెన్’, ‘కోకాకోలా’ సినిమాలు చేస్తోంది.
చదవండి: ఖరీదైన అపార్ట్‌మెంట్ కొన్న సన్నీలియోన్.. ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment