Shero Movie Update: Sunny Leone Motion Poster Released - Sakshi
Sakshi News home page

లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో సన్నీ లియోన్

Published Sat, Mar 27 2021 9:37 AM | Last Updated on Sat, Mar 27 2021 11:39 AM

Sunny Leone To Play Lead Role In Malayalam Thriller Shero Movies - Sakshi

మలయాళం నుంచి సన్నీ లియోన్‌కు మరోమారు కబురొచ్చింది. 2019లో మమ్ముట్టీ నటించిన ‘మధుర రాజా’ సినిమాలో సన్నీ లియోన్‌  ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. అయితే ఈ సారి పిలుపు వచ్చింది స్పెషల్‌ సాంగ్‌ కోసం కాదు. ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకి. 2018లో మలయాళ చిత్రం ‘కుట్టనాదన్‌  మార్పప్ప’ను డైరెక్ట్‌ చేసిన శ్రీజిత్‌ విజయన్‌ లేటెస్ట్‌గా ‘షీరో’ అనే ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఓ పిల్లాడిని కాపాడే యువతి పాత్రను చేస్తున్నారు సన్నీ లియోన్‌. ఈ విషయాన్ని శుక్రవారం సన్నీ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొంది. అలాగే మలయాళంలో ‘రంగీలా’ అనే మరో సినిమా కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement