
ఈ రోజుల్లో ఫేమస్ కావడం చాలా ఈజీ. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. అవకాశాల కోసం, అభిమానులను అలరించడంకోసం, ఆదాయం కోసం కూడా లేటేస్ట్ పిక్స్‌తో హల్‌చల్ చేస్తుంటారు. ఇందుకు సీనియర్, జూనియర్ నటీమణులు అంటూ ఎవరూ అతీతులు కారు.
వీరిలో యువ నటి దర్శా గుప్త వంటి వారికి ఈ సామాజిక మాధ్యమాలే అవకాశాల కోసం ముఖ్యమైన వేదికగా మారుతున్నాయి. బుల్లితెరపై విశేష ఆదరణను పొందిన దర్శా గుప్త రుద్ర తాండవం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ అయినా ఈ అమ్మడికి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషించిన ఓ మై ఘోస్ట్ చిత్రంలో యువ కథానాయకిగా నటించింది. అందులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోయడానికి వెనుకాడలేదు. ప్రస్తుతం మెడికల్ మిరాకిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.
దీంతో చేతిలో మరో అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ వేటలో పడింది. అందుకు ఈ బ్యూటీ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా. అందులో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే దర్శాగుప్త ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment