manchu vishnu As Gali Nageswara Rao new movie update Inside Telugu - Sakshi
Sakshi News home page

Manchu Vishnu As Gali Nageswara Rao: ‘గాలి నాగేశ్వరరావు’ సందడి మళ్లీ మొదలైంది

Published Sun, Apr 10 2022 8:05 AM | Last Updated on Sun, Apr 10 2022 9:06 AM

Manchu Vishnu New Movie Update - Sakshi

గాలి నాగేశ్వరరావు (మంచు విష్ణు చేస్తున్న పాత్ర పేరు) సందడి హైదరాబాద్‌లో మళ్లీ మొదలైంది. మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ ప్రధాన తారాగణంగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విష్ణు, సన్నీపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌లో విష్ణు, సన్నీ చేసిన ఓ సరదా రీల్‌ వైరల్‌ అవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కోన వెంకట్,  కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement