తెలుగులో సన్నీ లియోన్‌, ప్రియమణి ‘క్యూజీ’ | M Venugopal Got QG Movie Telugu Rights | Sakshi
Sakshi News home page

తెలుగులో సన్నీ లియోన్‌, ప్రియమణి ‘క్యూజీ’

Published Sun, Aug 18 2024 12:17 PM | Last Updated on Sun, Aug 18 2024 1:10 PM

M Venugopal Got QG Movie Telugu Rights

తెలుగు రిలీజ్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న నిర్మాత ఎం. వేణుగోపాల్‌

జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్యూజీ. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై  నిర్మాత ఎం. వేణుగోపాల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా వేణు గోపాల్‌ మాట్లాడుతూ..క్యూజీ సినిమా తెలుగు రిలీజ్‌ రైట్స్‌ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. . ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.  అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement