venu gopal
-
తెలుగులో సన్నీ లియోన్, ప్రియమణి ‘క్యూజీ’
జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్యూజీ. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఎం. వేణుగోపాల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ మాట్లాడుతూ..క్యూజీ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. . ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
ఇకపైన పొటాషియం ఉప్పు వాడకం?!
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది. అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట. ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి. ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది. ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. డా. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055 -
ఎట్టకేలకు ఆ మూడూ..
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిపోయిన మూడు స్థానాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేసింది.ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డికి అవకాశం ఇచ్చారు.రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన డోర్నకల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నుంచి నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. రఘు రాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సినీ హీరో దగ్గుబాటి వెంకటే‹Ùలకు వియ్యంకుడు. కాగా నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు. అగ్రవర్ణాలకు 8 స్థానాలు: రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా, ఇందులో 8 టికెట్లను కాంగ్రెస్ అగ్రవర్ణాలకు కేటాయించింది. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఒకటి ఆదివాసీ, మరోటి లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించగా, ఎస్సీ రిజర్వుడు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లను మాలలకు, వరంగల్‌ను మాదిగలకు కేటాయించింది.మెదక్, సికింద్రాబాద్, జహీరాబా ద్ స్థానాలను బీసీలకు కేటాయించగా, హైదరాబాద్ సీటును మైనార్టీకి, కరీంనగర్ స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి, నిజామాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడం గమనార్హం. అది బీసీకే..: మూడు లోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారుచేశారు. కరీంనగర్ లోక్‌సభ రేసులో ఆయన పేరు వినిపించినా.. అక్కడ ఓసీ వర్గానికి టికెట్ కేటాయించారు. దీంతో బీసీ వర్గానికి చెందిన మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం గమనార్హం. -
అంతరించిపోయే దశలో నీటి వనరులు
సాక్షి, హైదరాబాద్: మహా నగరం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తూపోతున్నారని.. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని.. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే నీటి వనరులు లేని నగరంగా హైదరాబాద్ మారే ప్రమాదం పొంచి ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణ, వాటి దుస్థితిని అందులో వివరించారు. ఈ లేఖను సీజే ధర్మాసనం.. సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హోంశాఖ, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది. ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు ‘అక్రమంగా నాలాలను ఆక్రమించి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. చెరువులు, కుంటలు సహా నీటివనరుల ఆక్రమణను ఇలానే వదిలేస్తే భవిష్యత్‌లో తాగునీటికీ కటకట ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చెరువులు, కుంటలనూ వదలని అక్రమార్కులు వాటిలోకి నీరు చేరకుండా పరీవాహక ప్రాంతాలనూ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నగరంలోని చాలాప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. కొన్నిచోట్ల నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. సంప్రదాయ నీటివనరుల ఆక్రమణను ఇలా వదిలేస్తూ పోతే చెరువులు, నీటివనరులు, నాలాలు లేని నగరంగా హైదరాబాద్ త్వరలోనే మారుతుంది. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఆక్రమణలు, భారీ విల్లాల నిర్మాణాల కారణంగా హైదరాబాద్‌లోని నీటివనరులు అంతరించిపోయే పరిస్థితి. ఇది పర్యావరణంలో తీవ్ర అసమతుల్యతకు దారితీస్తోంది. భారీ వర్షాలు వస్తే నీరు సాఫీగా పోయే మార్గాలు లేక ఒత్తిడి పెరిగి వరదలు జనావాసాలను ముంచెత్తుతాయి. ఆస్తులకే కాకుండా ప్రజల జీవితాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం లేకపోలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ప్రజా జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. జనాభా నిష్పత్తికి తగ్గట్టు చెట్లు కూడా లేక స్వచ్ఛమైన గాలి అందడం లేదు. పర్యావరణం దెబ్బతిని ఎల్‌నినో, లానినో లాంటివి సంభవిస్తున్నాయి. చెరువులు, నీటివనరులు, నాలాల పరిస్థితిపై రెడ్ అలర్ట్ ప్రకటించాలి. వాటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పలు శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలి’అని జస్టిస్ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్, జిన్నారం, పటాన్చెరు, ఆర్సీ పురం, కంది, సంగారెడ్డి, హత్పూర మండలాల్లో 90కి పైగా చెరువుల ఆక్రమణను ఆయన సీజే దృష్టికి తెచ్చారు. ఈ పిల్‌పై నేడు (గురువారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
స్కామ్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చంద్రబాబే..!
-
ఫైబర్ గ్రిడ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్
-
టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి కోదండరెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మెయిల్ ద్వారా పంపారు. రాజీనామా ప్రతులను ఎంపీ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిలకు పంపారు. తనకు ఇన్నేళ్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన టీంను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన రాజీనామా విషయమై కోదండరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాత గతంలో ఉన్న కమిటీలకు రాజీనామాలు చేయడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని చెప్పారు. కొన్ని పిటిషన్లు తన వద్ద పెండింగ్‌లో ఉన్నందున అప్పుడు రాజీనామా చేయలేదని, ఇప్పుడు అన్ని పిటిషన్ల విచారణ పూర్తి అయిందని చెప్పారు. రాజీనామాకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. -
దేహం సైతం దేశానికే...
పోరాట యోధుడు పుణ్యలోకాలకేగాడు.. త్యాగధనుడు స్వర్గసీమకు పయనమయ్యాడు.. మాతృభూమి రుణం తీర్చిన ధన్యుడు అమరపురికి వెళ్లాడు.. దేశసేవే శ్వాసగా జీవించిన చరితార్థుడు భరతమాత ముద్దుబిడ్డగా గుర్తిండిపోతాడు. విశ్రాంత మేజర్ జనరల్ వేణుగోపాల్ అసువులు వాసినా ప్రజల హృదయాల్లో చెరగని చిత్తరువుగా నిలిపోయారు. విశ్రాంత మేజర్ జనరల్ వేణుగోపాల్‌కు ఘన నివాళి అధికార లాంఛనాలతో వీడ్కోలు తిరుపతి అన్నమయ్య సర్కిల్: మహావీరచక్ర బిరుదాంకితులు రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్‌కు బుధవారం తిరుపతిలోని ఆయన స్వగృహం వైట్‌హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. చెన్నై 12వ ఆర్మీ రెజిమెంట్ ఆధ్వర్యంలో గార్డ్ ఆఫ్ ఆనర్తో అంతిమ వీడ్కోలు పలికారు. మేజర్ వేణుగోపాల్ భారత సైనిక దళంలో 36 ఏళ్లపాటు విశేష సేవలు అందించారు. సాయుధ దళాల స్వర్ణోత్సవాల్లో భాగంగా గత ఫిబ్రవరి 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మేజర్ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా విజయ జ్వాలను అందుకున్నారు. దేశసేవకు అంకితం చిన్నస్వామి, రుక్మిణమ్మ దంపతుల 9 మంది సంతానంలో చిత్తూరు వేణుగోపాల్ రెండోవారు. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఆర్మీలో హవల్దార్‌గా చేఆరు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ డెహ్రాడూన్‌లో సీటు సాధించారు. కఠోర శిక్షణ పొంది గుర్కారైఫిల్లో చేరి లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగారు. దేశం కోసం ఆయన వైవాహిక జీవితాన్నే త్యాగం చేశారు. పెళ్లి చేసుకుంటే పూర్తి సమయాన్ని విధి నిర్వహణకు కేటాయించలేమని ఆయన బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. బంగ్లాదేశ్ విమోచనకు 1971లో జరిగిన ఇండో- పాక్ యుద్ధంలో ఆయన బెటాలియన్ నాయకుడిగా ప్రధాన భూమిక పోషించారు. 36 ఏళ్ల సైన్యంలో పనిచేసిన వేణుగోపాల్ 1984లో పదవీ విరమణ పొందారు. మేజర్ జనరల్ వేణుగోపాల్ 1972లో మహావీర చక్ర, 1980లో పరమ విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. వేణుగోపాల్ కోరిక మేరకు ఆయన పార్థివ దేహాన్ని బుధవారం ఎస్వీ మెడికల్ కళాశాలకు అప్పగించారు. -
కాంగ్రెస్‌ను వీడి సొంత గూటి వైపు..
సాక్షి, కామారెడ్డి: గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతలు తిరిగి సొంతగూటి వైపు చూస్తున్నారు. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌తో పాటు టీఆర్ఎస్లో కొనసాగుతున్న డాక్టర్ సిద్ధరాములు, మోతె కృష్ణాగౌడ్, పుల్లూరి సతీశ్, జూలూరి సుధాకర్, చింతల రమేశ్, పేర రమేశ్, నర్సింలు, నరేందర్ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ మొదట్లో బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన కామారెడ్డి కౌన్సిలర్‌గానూ పనిచేశారు. తరువాత ఆలె నరేంద్ర వెంట నడిచి కారెక్కారు. 2004లో ఆ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. (చదవండి: టీఆర్ఎస్కు షాక్!) అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ను వీడి, కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. డాక్టర్ సిద్ధరాములు గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత టీఆర్ఎస్లో చేరారు. మోతె కృష్ణాగౌడ్ గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. పుల్లూరి సతీశ్, జూలూరి సుధాకర్, చింతల రమేశ్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసినవారే. వీరంతా సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. -
వేణుగోపాల్ ధూత్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్ మొజాంబిక్‌లోని చమురు, గ్యాస్ ఆస్తులకు సంబంధించి రుణాలు తీసుకున్న కేసులో అవినీతికి పాల్పడినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చమురు మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం సీబీఐ కేసు నమోదు చేసింది. వీడియోకాన్ సబ్సిడరీ అయిన వీడియోకాన్ హైడ్రోకార్బన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (వీహెచ్హెచ్ఎల్) 2008లో మొజాంబిక్‌లోని రొవుమా ఏరియా 1 బ్లాక్‌లో చమురు, గ్యాస్ ఆస్తుల్లో 10 శాతం వాటా కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి 2,773 మిలియన్ డాలర్ల రుణాలను అందించాయి. ఇందులో కొంత మేర రీఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. తర్వాత ఈ ఆస్తులను వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఓఎన్జీసీ విదేశ్, ఆయిల్ ఇండియాకు విక్రయించింది. అయితే, ఈ రుణాల విషయంలో వాస్తవాలను దాచిపెట్టి వీడియోకాన్ మోసగించినట్టు బయటపడింది. -
‘ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు తగదు’
శ్రీనగర్ : ఆర్టికల్ 370, 35A రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులెలా ఉన్నాయనే అంశంఫై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టైమ్స్ ఎడిటర్ అనురాధా బాసిన్ సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్కడ సమాచార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆమె వాపోయారు. దీనిపై అడ్వకేట్ వ్రిందా గ్రోవర్ సమాధానమిస్తూ.. సమాచార లోపం కారణంగానే శ్రీనగర్‌కు బదులుగా జమ్ములో పత్రికలు ప్రచురితమవుతున్నాయని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లోపం లేదని అటార్నీజనరల్ వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు చేయడం తగదన్నారు. కశ్మీర్ అంశం పట్ల ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడానికి కోర్టుకు కొంత సమయం కావాలని చీఫ్ జస్టిస్ రంజన్ గగొయ్ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. శుక్రవారం వెలువడిన కొన్ని వార్తా పత్రికలు జమ్మూకశ్మీర్‌లో ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్ కనెక్షన్ల సేవలు పునరుద్ధరించినట్టు పేర్కొన్నాయి. -
ఫ్యాన్ గుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు
సాక్షి, దర్శి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే రైతులు, పేదల అభివృద్ధికి ఓటు వేసినట్లేనని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని దేవవరం, పోతవరం, శేషంవారిపాలెం, తానం చింతల, గుట్టమీద పల్లె గ్రామాల్లో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లిన మద్దిశెట్టికి పూలు చల్లి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వేణుగోపాల్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రైతులకు తీరని అన్యాయం చేసిందని మండి పడ్డారు. గత ఎన్నికల ముందు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని కల్లబోల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. కందులు కొనుగోలు కేంద్రాల టీడీపీ నేతలు దక్కించుకుని రైతులకు రావాల్సిన సబ్సిడీలను కూడా అక్ర మ మార్గంలో దిగ మింగారని మండి పడ్డారు. సంక్షేమం విస్మరించి దోపిడీయే లక్ష్యంగా పాలన కొసాగించారన్నారు. ఎస్సీ ఎస్టీల నిధులు దారి మళ్లించి అడ్డగోలుగా దోచుకుని వారి నోట్లో మట్టికొట్టారన్నారు. బీసీలకు 50వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి వారినీ మోసం చేశారని చెప్పారు. ఉద్యోగం లేనివారికి రూ.2వేలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకి వార్డు మెంబర్‌గా కూడా గెలవని ఆయన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యో గం ఇచ్చారన్నారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి పాశం జయశింహారావు, ప్రభాకర్, జాన్‌పాల్, పంటా యలమందారెడ్డి, గాజుల చిన్నకేశవులు, చిన్న ఏసు, పోలు బ్రహ్మయ్య, గుడిపల్లి వెంకటేశ్వర్లు, తలపాటి కనకాద్రి, చేప జగజ్జీవన్‌రావు, పోతం శెట్టి సుబ్బనరసయ్య,పోతం శెట్టి నరశింహులు, శేషం వెంకటేశ్వర్లు, శేషం పెద్ద వెంకటేశ్వర్లు, ఏటి ఏడుకొండలు, గుండి బోమ్మ చెన్నయ్య, పోతంశెట్టి హరికృష్ణ, కోరె సుబ్బారావు, తిరుమల కొండ, ముక్కు శ్రీను, వై ఏస్, మూడముచ్చు వెంకయ్య, ఒంటేరు మల్లిఖార్జున్, కొండయ్య, వెంకన్నబాబు, వెంకటశివయ్య, ఏసు రత్నం, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు దర్శి మండలం చందలూరు గ్రామం, తాళ్లూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ శంఖం హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 500 మంది వైఎస్సార్ సీపీలోకి చేరారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారికి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెన్నం శెట్టి రామాంజనేయులు, బత్తుల కోటేశ్వరరావు, సీతారమయ్య, హనుమంతరావు, వెంకటస్వామి, కోటయ్య, మారిశెట్టి వెంకయ్య, సుబ్బారావు, ఆంజనేయులు, భాస్కర్‌రావు, ఏసురత్నం, అనపర్తి కోటయ్య, వెంకయ్య, తిరుపాటి స్వామి సుబ్బారావులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. చందలూరు నుంచి పార్టీలో చేరిక చందలూరు నాయకులు అందం సత్యం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గుంజా ఆంజనేయులు, గుంజా పెద్ద ఆంజనేయులు, అచ్చయ్య, గుంజా వెంకటస్వామిలు ఉన్నారు. ఊపందుకున్న ప్రచారం కురిచేడు: వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ తరఫున ప్రచార కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ సభ్యులు పోతిరెడ్డి నాగిరెడ్డి , బుల్లం వెంకటనర్సయ్య, సయ్యద్ జానీ,కే సంతోష్‌కుమార్, ఎన్. వెంకట రెడ్డి, కౌలూరి నర్సింహ, ఎన్.అంజిరెడ్డి, దేవా, సదయ్య పాల్గొన్నారు. లక్కవరంలో.. తాళ్లూరు: పంచాయతీ పరిధిలో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఓటు వేయాలని ఆయన తరఫున తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర సతీమణి మద్దిశెట్టి సునీత ప్రచారం నిర్వహించారు. నవరత్నాల కర పత్రాలు పంపిణీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట గ్రామ మాజీ సర్పంచి టీవీఆర్ సుబ్బారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకాయమ్మ , జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి, నాయకులు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. -
విశాఖ ఎయిర్పోర్ట్ సీఎస్‌వో బదిలీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రదారులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చెన్నైకి బదిలీ చేసింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా, సూత్రధారుల జోలికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ మొక్కుబడిగా విచారణ చేస్తుంటే.. కేంద్ర పరిధిలోని సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అప్పుడే చర్యలు మొదలు పెట్టాయి. ఘటన జరిగిన అక్టోబరు 25న అనుమానాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌వో వేణుగోపాల్‌ను చెన్నైకి సాగనంపుతూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆది నుంచీ టీడీపీ నేతలతోనే.. ఐదేళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే కొనసాగుతున్న వేణుగోపాల్‌కు ఇప్పటివరకు రెండుసార్లు బదలీ ఉత్తర్వులు వచ్చినా అధికార పార్టీ నేతల అండతో నిలిపివేయించుకున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో అంటకాగే వేణుగోపాల్.. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరితో కూడా చెట్టపట్టాల్ వేసుకుని తిరిగేవారు. ఘటన జరిగిన రోజు ఆయన వ్యవహారశైలి జగన్‌పై హత్యాయత్న కుట్రకు సహకరించారనేలా ఉంది. ఇదే విషయమై సీఐఎస్ఎఫ్ అధికారులు వేణుగోపాల్ వ్యవహారశైలిని సూటిగా ప్రశ్నించారు కూడా. హత్యాయత్న ఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్ పక్కన ఉండకుండా నిందితుడు శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని నిలదీశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారు వేణుగోపాల్‌పై ప్రశ్నలు కురిపించారు. కప్పు కాఫీకి అనుమతించలేదుగానీ.. వైఎస్ జగన్ గత రెండు నెలలుగా ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన సందర్భాల్లో వైఎస్సార్సీపీ స్థానిక నేత జియ్యాని శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హత్యాయత్న ఘటనకు రెండు వారాల క్రితం సీఎస్‌వో వేణుగోపాల్.. బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్‌కు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తామని ఎంత చెప్పినా వేణుగోపాల్ అంగీకరించలేదు. ఇదే అదనుగా శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే వేణుగోపాల్ బయట నుంచి వస్తున్న కాఫీని అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తాయి.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి కూడా బయటి నుంచి వచ్చే ఫుడ్‌నే ఎయిర్పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లో తీసుకుంటుంటారు. వైఎస్ జగన్‌కు తీసుకువచ్చే కాఫీ విషయంలో వేణుగోపాల్ వ్యవహరించిన తీరుతోపాటు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులోకి స్వేచ్ఛగా కత్తులు తీసుకువచ్చినా అడ్డుకోలేకపోవడంతో ఆయనపై సందేహాలు బలపడ్డాయి. -
వైఎస్ జగన్‌పై వేణుగోపాల్ ఆంక్ష
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో కుట్రదారులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) వేణుగోపాల్ వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. జగన్‌పై హత్యాయత్నం చేసిన దుండగుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంతో వేణుగోపాల్ ఆ కుట్రకు సహకరించారన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఇటీవల కాలంలో కప్పు కాఫీ కూడా బయటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతుల్లేవని నానా హంగామా చేసిన వేణుగోపాల్.. కత్తులు తీసుకుని ఎయిర్‌పోర్టులోకి వస్తే ఎందుకు అడ్డుకోలేకపోయారన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే జగన్‌ను అంతమొందించాలనే కుట్రలో భాగంగా బయటి నుంచి కాఫీలకు కూడా అనుమతుల్లేవంటూ హడావుడి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్‌కు బయట కాఫీకి ‘నో’ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గత కొంతకాలంగా ఎయిర్‌పోర్టుకు విచ్చేస్తున్న సందర్భాల్లో పార్టీ 42వ వార్డు అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే సందర్భాల్లో మాత్రమే ఫ్లైట్ చెకింగ్‌కు సమయముంటే వీవీఐపీ లాంజ్‌లో కాసేపు ఆగి కాఫీ తాగి వెళ్లేవారు. అయితే, రెండు వారాల క్రితం బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై సీఎస్‌వో వేణుగోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ ఉండగా, బయటి నుంచి కాఫీలు తెచ్చుకుంటే అద్దెలు కట్టుకుంటున్న రెస్టారెంట్ వారి పరిస్థితి ఏమవుతుందని చిందులు తొక్కారు. ఇందుకు శ్రీధర్‌తోపాటు పార్టీ నేతలు.. జగన్ గారు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తాం.. మిగిలిన వారంతా రెస్టారెంట్ నుంచే కొనుగోలు చేస్తామని చెప్పారు. అందుకు కూడా కుదరని వేణుగోపాల్ ఖరాకండిగా చెప్పారు. పైగా శ్రీధర్ ఇంటి నుంచి తీసుకొచ్చిన కాఫీ ఫ్లాస్క్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెండు వారాలుగా రెస్టారెంట్ నుంచే కాఫీ, టీలు కొనుగోలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే అదనుగా దుండగుడు శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే బయట నుంచి తీసుకువస్తున్న కాఫీని వేణుగోపాల్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు కూడా బయటి నుంచి ఫుడ్ తెచ్చుకుని మరీ ఎయిర్పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లో కూర్చుని తీసుకుంటుంటారు. వీరి విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించని వేణుగోపాల్.. జగన్ విషయంలోనే వివాదం చేయడంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. -
విలువల కోసం కడదాకా ఆరాటం
సరిగ్గా ఆరువారాల కింద ఆగస్టు 5 సాయంకాలం విశాఖ సముద్రతీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపల్లి కోటేశ్వరమ్మ వందేళ్ల పుట్టినరోజు పండుగ జరి గింది. తెలుగుసీమ నలుమూలల నుంచీ వచ్చిన మూడు నాలుగు వందల మంది విభిన్న రాజకీయ, సామాజిక అభిప్రాయాలున్న స్నేహితులను ఉద్దేశించి కోటేశ్వరమ్మ ఒక అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ వయసులో సాధారణంగా గళంలో వినిపించే వణుకు, తడబాటు కూడా లేకుండా ఆమె చేసిన ఆ క్లుప్త ఉపన్యాసం సమాజానికి ఆమె ఇచ్చిన చివరి బహిరంగ సందేశం కావచ్చు. నిజానికి తుది శ్వాస విడవడానికి వారం ముందు కూడ రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా విశాఖలో జరిగిన ఒక నిరసన ప్రదర్శన ఎట్లా జరిగిందనీ, రావలసినవారందరూ వచ్చారా, అందరినీ పిలి చారా అనీ వాకబు చేశారంటే ఆమె చివరిదాకా పడిన తపన, హృదయంలో నింపుకున్న ఆదర్శాలు అర్థమవుతాయి. సమాజం కోసం పనిచేయడం, అన్నివర్గాల అణగారిన ప్రజల బాగుగురించి ఆలోచించడం, వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమాజ సమస్యల గురించి ఆలోచించడం వంటి ఆదర్శాలవి. 20వ శతాబ్ది తొలి దశకాలలో జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ప్రేరేపించిన విలువలవి. వాటిని సంపూర్ణంగా తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కోటేశ్వరమ్మ. ఆ తపన, ఆదర్శాలు, విలువలు ఏదో ఒక సందర్భంలో ఏర్పడి ఆ సందర్భం ముగిసిపోగానే లుప్తమైనవి కాకపోవడమే కోటేశ్వరమ్మ ప్రత్యేకత. ఆ విలువలు తొలి యవ్వనంలో 1930ల చివర జాతీయోద్యమ ప్రభావంలోకి వచ్చినప్పుడు ప్రారంభమై, ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీల మీదుగా ఈ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచేవరకూ ఎని మిది దశాబ్దాలపైన నిరంతరంగా కొనసాగాయి. ఈ సుదీర్ఘ జీవితంలో కళాకారిణిగా, గాయకురాలిగా, అజ్ఞాత కార్యకర్తగా, కవిగా, కథారచయితగా, వార్డెన్‌గా, తల్లిగా, అమ్మమ్మగా ఆమె గడిపిన బహిరంగ ప్రజాజీవితం ఎంత ఉద్వేగభరితంగా గడిచిందో, బాల్య వితంతువుగా, సహచరుడితో విభేదాలు వచ్చిన భార్యగా, పిల్ల లకు దూరంగా ఒంటరిగా గడపవలసి వచ్చిన తల్లిగా ఆమె వ్యక్తిగత జీవితం అంత దుఃఖభరితంగా సాగింది. అటు ఉద్వేగభరితమైన సామాజిక జీవితాన్నైనా, ఇటు కష్టభరితమైన వ్యక్తిగత జీవితాన్నైనా స్థితప్రజ్ఞతతో గ్రహించి ఎన్నడూ తన విలువలను, ఆదర్శాలను వదులుకోకుండా జీవించడమే ఆమె సమాజానికి ఇచ్చిన సందేశం. అలా కష్టాల కొలిమిలో పదునుదేరిన విశిష్ట వ్యక్తిత్వం గనుకనే ఆమె నిలువెల్లా కరుణ గల మనిషి అయింది. తన కన్నబిడ్డ కరుణ చనిపోయినా, వ్యక్తిమాత్రమైన కరుణ కోసం దుఃఖిస్తూనే సమాజానికి అవసరమైన గుణంగా కరుణ బతకాలి అని కోరుకుంది. చివరి ఉపన్యాసంలో కూడా కరుణ బతకడమంటే, కరుణను బతికించడమంటే హెచ్చుతగ్గులు, కుల అసమానతలు, విభేదాలు లేకుండా, సమసమాజ నిర్మాణంకోసం పనిచేయడమే అని నిర్వచించింది. అలాగే చివరి చూపు కూడ దక్కని తన కన్నబిడ్డ చందు కోసం దుఃఖిస్తూనే, నా కొడుకు చేసిన త్యాగం చేయమని చెప్పను గానీ, చచ్చిపోయేంతవరకు దేశానికి ఉపకారం చేసే, స్నేహభావాన్ని కనబరచే, మంచిపనులు చేసే మంచి మనుషులు కావాలి అని చెప్పింది. ఆస్తినీ, భర్తనూ, పిల్లలనూ కోల్పోయినప్పటికీ తాను ఆశావాదం కోల్పోలేదని చెప్పింది. ఒక సమసమాజ నిర్మాణం కోసం, ఆ భవిష్యత్తుకూ వర్తమానానికీ ఉన్న దూరాన్ని దగ్గర చేయడం కోసం యువకులు వస్తారనీ, రావాలనీ, ఆ ఆశతోనే తాను జీవిస్తున్నాననీ చెప్పింది. కరుణతో కొనసాగాలంటే, ఆశను కొడిగట్టిపోకుండా నిలుపుకోవాలంటే అపారమైన త్యాగాలు అవసరమని కూడా తనకు తెలుసు. తనకు నాయకులుగా, గురువులుగా, మార్గదర్శులుగా ఉండిన చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యల త్యాగనిరతిని సన్నిహితంగా చూసింది గనుక ఆ మహనీయుల త్యాగాన్ని కొనసాగించాలనే స్ఫూర్తిని మొన్నటి ఉపన్యాసంలో కూడ ప్రకటించింది. వారిలాగ దేశాన్ని బాగు చేసేవాళ్లు మళ్లీ వస్తారు అనే ఆశాభావాన్ని ప్రకటించింది. ఆమె రూపొందిన క్రమంలో ఏర్పడిన, ఇవాళ మరింత ఎక్కువ ప్రాసంగికంగా మారిన ఒక విలువ గురించి చివరి ఉపన్యాసంలోనూ ప్రస్తావించారని గుర్తిస్తే ఆమె హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది. ఆ ఉపన్యాసంలో ఆమె చండ్ర రాజేశ్వర రావు గురించి చెపుతూ బెజవాడలో రౌడీల సమస్య లేకుండా చేశారు అన్నారు. ఆమె నవయవ్వనంలో ఉన్నప్పుడు బెజవాడలో ఉండిన ఆ రౌడీల సమస్య ప్రధానంగా సంఘ్ పరివార్ సమస్య. వారిని భావజాలపరంగా ప్రతిఘటించడానికి గాంధీ హత్యకు ఏడాది ముందే చండ్ర రాజేశ్వరరావుగారు పుస్తకం రాశారు. గాంధీ హత్యకు ముందూ వెనుక పెచ్చరిల్లిన ఆ రౌడీమూకలను అరికట్టడానికి లాఠీలు పట్టుకుని భౌతిక ఘర్షణకు కూడ దిగే కార్యకర్తలను తయారు చేశారు. ఆ అవసరం మళ్లీ పెరుగుతున్న సందర్భంలో ఉన్న మనం ఆ పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలను కనిపెట్టవలసి ఉంది. త్యాగాల పునాదులతో నిర్మాణమైన విలువల జీవితాలలో అత్యంత ఆదర్శప్రాయమైన కోటేశ్వరమ్మ జీవితాన్ని, ఆమె స్వప్నాలను, అర్థంతరంగా ఆగిపోయిన ఆమె ఆకాంక్షలను మరొక్కసారి మననం చేసుకోవలసి ఉంది. ఆ విలువలు జీవించినంతకాలం కోటేశ్వరమ్మ సజీవంగానే ఉంటారు. అవి ఉదాత్తమైన, మానవజాతి లక్ష్యంగా నిర్వచించుకున్న విలువలు గనుక వాటికెప్పుడూ మరణం లేదు. అంటే కొండపల్లి కోటేశ్వరమ్మకూ మరణం లేదు. వ్యాసకర్త ఎన్. వేణుగోపాల్ వీక్షణం సంపాదకులు ‘ 98485 77028 -
ఆర్టీసీలో సమ్మె సైరన్
సీసీఎస్ నుంచి తీసుకున్న నిధులు చెల్లించాలని ఈయూ డిమాండ్ ప్రభుత్వం గ్రాంటు ఇస్తే చెల్లిస్తామన్న అధికారులు 2 నుంచి సమ్మెలోకి వెళుతామని ప్రకటించిన కార్మికసంఘాలు సాక్షి, హైదరాబాద్: కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను సొంతానికి వాడుకుని తిరిగి జమచేయని అంశం ఆర్టీసీలో చిచ్చురేపుతోంది. నిధులకోసం కార్మికులు సమ్మెబాట పట్టారు. శనివారం నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్‌కు కార్మిక నేతలు తేల్చి చెప్పారు. సీసీఎస్‌కు సంబంధించి ఆర్టీసీ ఇప్పటికే రూ.220 కోట్లను వాడుకుంది. వడ్డీతో కలిపి ఇది రూ.293 కోట్లకు చేరింది. క్రెడిట్ సొసైటీకి ఈ సొమ్మును జమచేయకపోవటంతో కార్మికులకు రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా ఈయూ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేస్తున్నారు. ఈక్రమంలో రెండు రోజులుగా హైదరాబాద్, విజయవాడల్లో నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్ ఈయూ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, తెలంగాణ ప్రతినిధులు బాబు, భాస్కరరావు, మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు దామోదరరావు, సోమరాజు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సీసీఎస్ సొమ్మును చెల్లించే పరిస్థితి లేదని, ప్రభుత్వం గ్రాంటు ఇస్తే సీసీఎస్‌కు జమ చేస్తామని ఇన్చార్జి ఎండీ వేణుగోపాల్ వారికి స్పష్టం చేశారు. అయితే దీనికి ఒప్పుకోని నేతలు వెంటనే సీసీఎస్ నిధులు జమచేయని పక్షంలో ముందు హెచ్చరించినట్టుగా రెండో తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. అయితే సమ్మె విషయంలో ఈయూతో మరో ముఖ్య కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) విభేదిస్తోంది. ముందస్తు నోటీసులు లేకుండా సమ్మెచేయడం సరికాదని పేర్కొంది. 4న ఎర్రబ్యాడ్జీలతో నిరసన : ఎన్ఎంయూ ఆర్టీసీలో వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. తదితర విషయాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ 4న కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధుల్లో పాల్గొంటారని ఎన్ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘పంచె’ చిచ్చు!
సాక్షి, చెన్నై : తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా చెన్నై క్రికెట్ క్లబ్లో చోటు చేసుకున్న వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంచె కట్టును వ్యతిరేకించడమే కాకుండా, బాధ్యత గల పదవి లో ఉన్న న్యాయమూర్తి, న్యాయవాదుల్ని బయటకు గెంటివేయడాన్ని న్యాయలోకం, తమిళాభిమాన సం ఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆ క్లబ్ భరతం పట్టడంతో పాటుగా తమిళ సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలు, స్టార్ హోటళ్లతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి. ముట్టడికి యత్నం తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్మురుగన్ ఆదేశాలతో ఆ పార్టీ నేత వేణుగోపాల్ నేతృత్వంలో సుమారు వంద మంది కార్యకర్తలు ఉదయాన్నే పంచె కట్టుతో చేపాక్కంలో ప్రత్యక్షం అయ్యారు. తమ పార్టీ జెండాలను చేత బట్టి చేపాక్కంలోని చెన్నై క్రికెట్ క్లబ్‌లోకి చొరబడే యత్నం చేశారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం వాగ్యుద్ధానికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు వల యాన్ని తోసుకుంటూ ఆ క్లబ్‌లోకి వెళ్లడానికి ఆందోళనకారులు యత్నించారు. చివరకు పోలీసులు వారందరినీ బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించడంతో స్వల్ప తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుం ది. ఎట్టకేలకు వారందరినీ అరెస్టు చేశారు. తమిళర్ వాల్వురిమై బాట లో మరికొన్ని సంఘాలు ప్రయత్నిం చినా, మార్గం మధ్యలోని వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుల తో నిరసన ఆగదని, ఆ క్లబ్ భరతం పట్టి తీరుతామంటూ తమిళాభి మాన సంఘాలు హెచ్చరించాయి. కోర్టుకు : తమిళ సంప్రదాయా న్ని కించపరిచే విధంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌పై కోర్టుకు వెళ్లేందుకు సీనియర్ న్యాయవాది గాంధీ నిర్ణయించారు. ఆ క్లబ్ గెంటి వేసిన బాధితుల్లో సీనియర్ న్యాయవాది గాంధీ, స్వామినాథన్ కూడా ఉన్నారు. ఆ పుస్తక కార్యక్రమానికి ఆటంకం కలగకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజున ఆ క్లబ్ నుంచి మౌనంగా బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఆంక్షలను పక్కన పెట్టి, కనీసం తమ హోదాకు మర్యాదైనా ఇవ్వాల్సి ఉందని, ఇందుకు భిన్నంగా నడుచుకున్నారని మండి పడ్డారు. ఆ క్లబ్ నిర్వాకాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని, తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తానంటూ గాంధీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిపారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్‌తోపాటుగా మరికొన్ని రాజకీయ పక్షాలు పంచెకట్లు పరాభవం మీద స్పందించాయి. చెన్నై క్రికెట్ క్లబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రెస్ కోడ్ వంటి ఆంక్షలను తమిళనాడులో రద్దు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమర్థింపు : పంచెకట్టుకు ఎదురైన పరాభవాన్ని క్రికెట్ క్లబ్ సమర్థించుకుంది. ఆ సంఘం కార్యదర్శి కాశీ విశ్వనాథన్ పేర్కొంటూ, తమ క్లబ్ ఆంక్షలు నిన్న మొన్న పెట్టినవి కాదని వివరించారు. ఏళ్ల తరబడి అనుసరిస్తున్న తమ ఆంక్షలను ఎలా మార్చుకోమంటారని ఎదురు ప్రశ్న వేశారు. తమ క్లబ్లో ఏదేని ప్రైవేటు కార్యక్రమం జరపదలచిన పక్షంలో, ఆ నిర్వాహకులకు ముందుగానే ఆంక్షల వివరాలను తెలియజేస్తామన్నారు. తమ ఆంక్షలు, డ్రెస్ కోడ్‌ను సంబంధిత పుస్తకావిష్కరణ నిర్వాహకులకు తెలియజేసినట్లు వివరించారు. వారు తమ ఆహ్వానితులకు ఆ వివరాలు తెలియజేయనప్పుడు తామెలా బాధ్యులు అవుతామంటూ ఆయన ప్రశ్నించారు. -
ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. మెస్సర్స్ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. స్థల సేకరణ, నిర్మాణం ఆ సంస్థ చేపట్టనుందని వివరించారు. -
పుట్టపర్తిలో కేరళ వాసి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్, న్యూస్‌లైన్: కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన చేతి నరాలను కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుట్టపర్తిలో మంగళవారం చోటు చేసుకుంది. పుట్టపర్తి పట్టణ సీఐ వేణుగోపాల్, మృతుని మేనమామ శశికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా షోర్నూర్‌కు చెందిన ఉన్నికృష్ణన్ (32) దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కొంతకాలం క్రితం కేరళకు తిరిగి వచ్చిన ఆయన, ఈ నెల 9న పుట్టపర్తికి వచ్చాడు. ఉన్నికృష్ణన్ మేనమామ శశికుమార్ ఐదు నెలల కిందట పుట్టపర్తికి వచ్చి చిత్రావతి గుట్ట వద్ద చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటూ.. ప్రశాంతి నిలయంలో భక్తులకు సేవ చేస్తున్నాడు. పది రోజుల పాటు మేనమామ గదిలోనే ఉన్న ఉన్నికృష్ణన్ అనంతరం 19వ తేదీ రాత్రి చిత్రావతి రోడ్డులోని జయసాయి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని అందులోకి మారాడు. సోమవారం రాత్రి మేనమామతో కలసి ప్రశాంతి నిలయానికి వెళ్లి వచ్చాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ లాడ్జి గది నుంచి బయటికి రాకపోవడంతో శశికుమార్.. ఉన్నికృష్ణన్ గదికి వెళ్లి పరిశీలించాడు. చేతి నరాలు కోసుకోవడంతో తీవ్ర రక్త స్రావమై.. మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే శశికుమార్ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య సుచిత్ర, 18 నెలల వయసున్న కుమారుడు నిరంజన్ వారి స్వస్థలమైన షోర్నూర్‌లో ఉంటున్నారు. కాగా, ఉన్నికృష్ణన్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.