న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్ మొజాంబిక్‌లోని చమురు, గ్యాస్ ఆస్తులకు సంబంధించి రుణాలు తీసుకున్న కేసులో అవినీతికి పాల్పడినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. చమురు మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ అనంతరం సీబీఐ కేసు నమోదు చేసింది. వీడియోకాన్ సబ్సిడరీ అయిన వీడియోకాన్ హైడ్రోకార్బన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (వీహెచ్‌హెచ్‌ఎల్) 2008లో మొజాంబిక్‌లోని రొవుమా ఏరియా 1 బ్లాక్‌లో చమురు, గ్యాస్ ఆస్తుల్లో 10 శాతం వాటా కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి 2,773 మిలియన్ డాలర్ల రుణాలను అందించాయి. ఇందులో కొంత మేర రీఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. తర్వాత ఈ ఆస్తులను వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఓఎన్‌జీసీ విదేశ్, ఆయిల్ ఇండియాకు విక్రయించింది. అయితే, ఈ రుణాల విషయంలో వాస్తవాలను దాచిపెట్టి వీడియోకాన్ మోసగించినట్టు బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment