ఫ్యాన్‌ గుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు | Maddisetty Venugopal Election Campaign In Darsi Constituency | Sakshi
Sakshi News home page

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు

Published Tue, Mar 26 2019 12:44 PM | Last Updated on Tue, Mar 26 2019 12:45 PM

 Maddisetty Venugopal Election Campaign In Darsi Constituency - Sakshi

మాట్లాడుతున్న వేణుగోపాల్‌ 

సాక్షి, దర్శి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే రైతులు, పేదల  అభివృద్ధికి ఓటు వేసినట్లేనని వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. మండలంలోని దేవవరం, పోతవరం, శేషంవారిపాలెం, తానం చింతల, గుట్టమీద పల్లె  గ్రామాల్లో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లిన మద్దిశెట్టికి పూలు చల్లి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.  వేణుగోపాల్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రైతులకు తీరని అన్యాయం చేసిందని మండి పడ్డారు. గత ఎన్నికల ముందు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని కల్లబోల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. కందులు కొనుగోలు కేంద్రాల టీడీపీ నేతలు దక్కించుకుని రైతులకు రావాల్సిన సబ్సిడీలను కూడా అక్ర మ మార్గంలో దిగ మింగారని మండి పడ్డారు.

సంక్షేమం విస్మరించి దోపిడీయే లక్ష్యంగా పాలన కొసాగించారన్నారు. ఎస్సీ ఎస్టీల నిధులు దారి మళ్లించి అడ్డగోలుగా దోచుకుని వారి నోట్లో మట్టికొట్టారన్నారు. బీసీలకు 50వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి వారినీ మోసం చేశారని చెప్పారు. ఉద్యోగం లేనివారికి రూ.2వేలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకి  వార్డు మెంబర్‌గా కూడా గెలవని ఆయన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యో గం ఇచ్చారన్నారు. మండల కన్వీనర్‌ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి పాశం జయశింహారావు, ప్రభాకర్, జాన్‌పాల్, పంటా యలమందారెడ్డి, గాజుల చిన్నకేశవులు, చిన్న ఏసు, పోలు బ్రహ్మయ్య, గుడిపల్లి వెంకటేశ్వర్లు, తలపాటి కనకాద్రి, చేప జగజ్జీవన్‌రావు, పోతం శెట్టి సుబ్బనరసయ్య,పోతం శెట్టి నరశింహులు, శేషం వెంకటేశ్వర్లు, శేషం పెద్ద వెంకటేశ్వర్లు, ఏటి ఏడుకొండలు, గుండి బోమ్మ చెన్నయ్య, పోతంశెట్టి హరికృష్ణ, కోరె సుబ్బారావు, తిరుమల కొండ, ముక్కు శ్రీను, వై ఏస్, మూడముచ్చు వెంకయ్య, ఒంటేరు మల్లిఖార్జున్, కొండయ్య, వెంకన్నబాబు, వెంకటశివయ్య, ఏసు రత్నం, కార్యకర్తలు పాల్గొన్నారు.


వైఎస్సార్‌ సీపీలోకి భారీ చేరికలు
 దర్శి మండలం చందలూరు గ్రామం, తాళ్లూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్‌ శంఖం హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 500 మంది వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో వారికి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  పార్టీలో చేరిన వారిలో చెన్నం శెట్టి రామాంజనేయులు, బత్తుల కోటేశ్వరరావు, సీతారమయ్య, హనుమంతరావు, వెంకటస్వామి, కోటయ్య, మారిశెట్టి వెంకయ్య, సుబ్బారావు, ఆంజనేయులు, భాస్కర్‌రావు, ఏసురత్నం, అనపర్తి కోటయ్య, వెంకయ్య, తిరుపాటి స్వామి సుబ్బారావులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.


చందలూరు నుంచి పార్టీలో చేరిక 
చందలూరు నాయకులు అందం సత్యం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. మద్దిశెట్టి వేణుగోపాల్‌ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గుంజా ఆంజనేయులు, గుంజా పెద్ద ఆంజనేయులు, అచ్చయ్య, గుంజా వెంకటస్వామిలు ఉన్నారు. 


ఊపందుకున్న ప్రచారం
కురిచేడు: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌ తరఫున ప్రచార కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ సభ్యులు పోతిరెడ్డి నాగిరెడ్డి , బుల్లం వెంకటనర్సయ్య, సయ్యద్‌ జానీ,కే సంతోష్‌కుమార్, ఎన్‌. వెంకట రెడ్డి, కౌలూరి నర్సింహ, ఎన్‌.అంజిరెడ్డి, దేవా, సదయ్య పాల్గొన్నారు.  


లక్కవరంలో..
తాళ్లూరు:
పంచాయతీ పరిధిలో వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఓటు వేయాలని ఆయన తరఫున తాళ్లూరు మండల ఇన్‌చార్జి మద్దిశెట్టి  రవీంద్ర సతీమణి మద్దిశెట్టి సునీత ప్రచారం నిర్వహించారు. నవరత్నాల కర పత్రాలు పంపిణీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట గ్రామ మాజీ  సర్పంచి టీవీఆర్‌ సుబ్బారెడ్డి,  మండల మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకాయమ్మ , జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి, నాయకులు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement