Darsi constituency
-
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. 27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డులు, దాచేపల్లి నగర పంచాయతీ, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మార్చిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మరణం, అప్పట్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 19 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 10 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమోదించిన 838 నామినేషన్లను అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్నికలు జరుగుతున్న 46 డివిజన్లలోను వైఎస్సార్సీపీ బరిలో ఉంది. టీడీపీ 44 డివిజన్లలో పోటీ చేస్తోంది. నేనే తప్పుకొన్నా.. మా పార్టీవాళ్లే డ్రామా చేస్తున్నారు దర్శి టీడీపీ నేత శ్రీనివాసరావు దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక టీడీపీ నీచరాజకీయాలకు తెరతీసింది. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం స్వచ్ఛందంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం ముందు హైడ్రామా చేశారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ హడావుడి చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి, తాను స్నేహితులమని, స్నేహితుడిపై పోటీ చేసేందుకు ఇష్టం లేక నామినేషన్ ఉపసంహరించుకున్నానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ పెద్దలు తనను బెదిరించారని, సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని అధికారులకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ‘లాయర్‌తో లోపలికి వెళ్లు.. అంతా వాళ్లే చూసుకుంటారు..’ అని తనను బలవంతం చేశారని చెప్పారు. తాను ఇష్టపూర్వకంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నానని శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. -
దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చదవండి: (ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ) -
దర్శిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రచారం
-
విద్యా విప్లవానికి నాంది
సాక్షి, దర్శి టౌన్: విద్య విజ్ఞాన వికాసానికి చిరునామా..ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకం. బాల్యంలో సరైన పునాది పడితేనే బంగారు భవిష్యత్‌కు నాంది అవుతుంది. విద్యతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో పలువురు నిరుపేదలు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. భవిత అంధకారంగా మారి కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదలకు విద్య వైపు ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకున్న సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే .... ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బడికి పంపే పిల్లలకు ఒక్కక్కరికి రూ. 500, ఇద్దరు ఉంటే రూ. 1000లు చెల్లిస్తారు. 5 నుంచి 10వ తరగతి వరకు బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 750, ఇద్దరు ఉంటే రూ. 1500లు చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ ప్రతి నెల రూ.1000లు, ఇద్దరు ఉంటే రూ. 2000లు అందుతుంది. ఉన్నత చదువుల కోసం విద్యార్థుల మెస్ చార్జీలకు రూ. 20వేలు చెల్లిస్తారు. దర్శి నియోజకవర్గంలో... దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 72,715 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 344 ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలలో 31,215మంది, 31 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 41,500 మంది విద్యను అభ్యసించే వారిలో ఉన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదు ప్రతి నెలా పిల్లలకు చదువు కోసం నగదు ఇవ్వడం మంచి పరణామం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం ఏ ప్రభుత్వం అమలు పరచడం లేదు. ఇది అమలు జరిగితే పేద విద్యార్థులు విద్యావంతులవుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. – ముఖం లక్ష్మికుమారి, కురిచేడు పేదలకు వరం కూలీ నాలి చేసుకుని జీవనం కొనసాగించే వారి పిల్లలను చదివించే స్థోమత లేని పరిస్థితిలో నిరక్షరాస్యులుగా మిగిలుతున్నారు. కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితిలో ఇక పిల్లల గురించి ఏమి ఆలోచిస్తారు. అమ్మ ఒడి పథకం అమలయితే అనేక మంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. – దేసు రజని, కురిచేడు మాలాంటి వాళ్లకు ఉపయోగం నేను ఇలాంటి పథకాన్ని ఎప్పుడూ వినలేదు. పిల్లల కోసం ఏ నాయకుడూ ఆలోచించ లేదు. మేము పొలం కూలి పనులు చేసుకుని జీవించాలి. మాలాంటి వాళ్లకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. మా పిల్లల భవిష్యష్యత్కు డోకా లేకుండా ఉంటుంది. – వెన్నా రమణ, విద్యార్థిని తల్లి, పొట్లపాడు పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతారు ఇలాంటి పథకాల వలన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ తమ పిల్లలను చదివించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. తాము పేదరికంలో ఉన్న తమ పిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందించే అవకాశం ఉంది. ఇలాంటి నాయకులు మనకు అవసరం. – సుబ్బులు, తాళ్లూరు అమ్మ ఒడి ఒక వరం అమ్మ ఒడి పథకం పిల్లల పాలిట ఒక వరం. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి చదివించేవారు లేరు. చదివించే శక్తి లేక పొలం పనులకు తీసుకెళ్లాల్సి వస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పథకం వస్తే పిల్లలు చదువుకుని చల్లగా నీడ పట్టున బతికే అవకాశం కలుగుతుంది. మా కష్టాలు వారికి రాకుండాపోతాయి. – యేరేసి సుబ్బులు, విద్యార్థిని తల్లి, గంగదొనకొండ పిల్లలు బాగుపడతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమలు చేసే పథకంలో అమ్మ ఒడి వలన ఎంతోమంది పేద పిల్లల జీవితాలు ధన్యమవుతాయి. చదువుకునే స్థోమత లేక బజార్ల వెంట కాగితాలు ఏరుకుంటున్నారు. అలాంటి పిల్లలందరూ బడికి వచ్చి చక్కగా చదువుకుని బాగు పడతారు. – సూరా వెంకటరత్నం, కురిచేడు -
ఫ్యాన్ గుర్తుకు ఓటు.. అభివృద్ధికి చోటు
సాక్షి, దర్శి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేస్తే రైతులు, పేదల అభివృద్ధికి ఓటు వేసినట్లేనని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని దేవవరం, పోతవరం, శేషంవారిపాలెం, తానం చింతల, గుట్టమీద పల్లె గ్రామాల్లో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లిన మద్దిశెట్టికి పూలు చల్లి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వేణుగోపాల్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రైతులకు తీరని అన్యాయం చేసిందని మండి పడ్డారు. గత ఎన్నికల ముందు పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తామని కల్లబోల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. కందులు కొనుగోలు కేంద్రాల టీడీపీ నేతలు దక్కించుకుని రైతులకు రావాల్సిన సబ్సిడీలను కూడా అక్ర మ మార్గంలో దిగ మింగారని మండి పడ్డారు. సంక్షేమం విస్మరించి దోపిడీయే లక్ష్యంగా పాలన కొసాగించారన్నారు. ఎస్సీ ఎస్టీల నిధులు దారి మళ్లించి అడ్డగోలుగా దోచుకుని వారి నోట్లో మట్టికొట్టారన్నారు. బీసీలకు 50వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి వారినీ మోసం చేశారని చెప్పారు. ఉద్యోగం లేనివారికి రూ.2వేలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకి వార్డు మెంబర్‌గా కూడా గెలవని ఆయన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యో గం ఇచ్చారన్నారు. మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి పాశం జయశింహారావు, ప్రభాకర్, జాన్‌పాల్, పంటా యలమందారెడ్డి, గాజుల చిన్నకేశవులు, చిన్న ఏసు, పోలు బ్రహ్మయ్య, గుడిపల్లి వెంకటేశ్వర్లు, తలపాటి కనకాద్రి, చేప జగజ్జీవన్‌రావు, పోతం శెట్టి సుబ్బనరసయ్య,పోతం శెట్టి నరశింహులు, శేషం వెంకటేశ్వర్లు, శేషం పెద్ద వెంకటేశ్వర్లు, ఏటి ఏడుకొండలు, గుండి బోమ్మ చెన్నయ్య, పోతంశెట్టి హరికృష్ణ, కోరె సుబ్బారావు, తిరుమల కొండ, ముక్కు శ్రీను, వై ఏస్, మూడముచ్చు వెంకయ్య, ఒంటేరు మల్లిఖార్జున్, కొండయ్య, వెంకన్నబాబు, వెంకటశివయ్య, ఏసు రత్నం, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి భారీ చేరికలు దర్శి మండలం చందలూరు గ్రామం, తాళ్లూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ శంఖం హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 500 మంది వైఎస్సార్ సీపీలోకి చేరారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారికి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెన్నం శెట్టి రామాంజనేయులు, బత్తుల కోటేశ్వరరావు, సీతారమయ్య, హనుమంతరావు, వెంకటస్వామి, కోటయ్య, మారిశెట్టి వెంకయ్య, సుబ్బారావు, ఆంజనేయులు, భాస్కర్‌రావు, ఏసురత్నం, అనపర్తి కోటయ్య, వెంకయ్య, తిరుపాటి స్వామి సుబ్బారావులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. చందలూరు నుంచి పార్టీలో చేరిక చందలూరు నాయకులు అందం సత్యం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, గుంజా ఆంజనేయులు, గుంజా పెద్ద ఆంజనేయులు, అచ్చయ్య, గుంజా వెంకటస్వామిలు ఉన్నారు. ఊపందుకున్న ప్రచారం కురిచేడు: వైఎస్సార్ సీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ తరఫున ప్రచార కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ సభ్యులు పోతిరెడ్డి నాగిరెడ్డి , బుల్లం వెంకటనర్సయ్య, సయ్యద్ జానీ,కే సంతోష్‌కుమార్, ఎన్. వెంకట రెడ్డి, కౌలూరి నర్సింహ, ఎన్.అంజిరెడ్డి, దేవా, సదయ్య పాల్గొన్నారు. లక్కవరంలో.. తాళ్లూరు: పంచాయతీ పరిధిలో వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఓటు వేయాలని ఆయన తరఫున తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర సతీమణి మద్దిశెట్టి సునీత ప్రచారం నిర్వహించారు. నవరత్నాల కర పత్రాలు పంపిణీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట గ్రామ మాజీ సర్పంచి టీవీఆర్ సుబ్బారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకాయమ్మ , జిల్లా కార్యదర్శి బ్రహ్మారెడ్డి, నాయకులు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. -
దర్శి టీడీపీలో దోబూచులాట
ఒంగోలు సబర్బన్: దర్శి అసెంబ్లీ టిక్కెట్ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇంకా దోబూచులాట కొనసాగుతూనే ఉంది. సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఊపందుకున్న తరుణంలో ఇంకా దర్శి టీడీపీ అభ్యర్ధిపై ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వీడనే లేదు. జిల్లాలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి మాత్రం ఒకేసారి 12 మంది అసెంబ్లీ అభ్యర్ధులను, ముగ్గురు పార్లమెంట్ అభ్యర్ధులు ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శికి ప్రాతినధ్యం వహిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న శిద్దా రాఘవరావును ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలవంతంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన విషయం విధితమే. దీంతో దర్శి అసెంబ్లీ అభ్యర్ధి విషయంలో అధికార టీడీపీకి అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చివరకు ముఖ్యమంత్రి బావమరిది, సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కనిగిరి ఎమ్మెల్యేకు ఆ సీటు విషయంలో చుక్కెదురైంది. దీంతో చివరకు దర్శి నుంచి పోటీ చేయాలని కదిరి బాబూరావును అధిష్టానం ఆదేశించింది. దీనికి సుముఖంగా లేని కదిరి తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారు. అందులో భాగంగా ఇటీవల ఒంగోలు నగరంలో అఖిల భారత కాపు సమాఖ్య నాయకులు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ కూడా టిడిపి సీటు కేటాయించ లేదని, కనిగిరిలో కదిరికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనంటూ టీడీపీకి అల్టిమేటం జారీ చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలో జిల్లా కాపులకు రెండు సీట్లు కేటాయించారని ఏ ఒక్కరికీ కాపులకు కేటాయించకుండా జిల్లాలో టీడీపీ అభ్యర్ధులు ఏవిధంగా గెలుస్తారని వారు అప్పట్లో ప్రశ్నించారు. ఆ తరువాత కదిరి తన సన్నిహితులతో పామూరులో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి ఇటు కనిగిరిలోనూ, అటు దర్శిలోనూ నామినేషన్లు వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఆ తరువాత చివరకు దిక్కులేని స్థితిలో దర్శిలో మంత్రి తనయుడు శిద్దా సుధీర్‌ను నిలబెట్టాలని, అందుకు అధిష్టానం కూడా సమ్మతించాలని మంత్రి కోరారు. దీంతో ఇప్పటి వరకు దర్శి టిక్కెట్ విషయంలో అధిష్టానం కూడా కఠినమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మళ్లీ సుధీర్ దర్శిలో అభ్యర్థిగా ఉండవచ్చన ప్రచారం జోరుగా సాగింది. చివరకు గురువారం ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధిగా మంత్రి శిద్దా రాఘవరావు నామినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందలో భాగంగా తిరిగి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు శిద్దా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి శిద్దా నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో పాటు కదిరి బాబూరావు కూడా మంత్రి శిద్దాతో సమాలోచనలు జరిపారు. రెండు గంటలపాటు చర్చల అనంతరం చివరకు దర్శి నుంచి తానే పోటీ చేస్తానని కదిరి బాబూరావు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ జరిపిన సమాలోచనల వ్యవహారం మంత్రి శిద్దా రాఘవరావు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఇంకా టిక్కెట్ల పంచాయితీ అధికార టీడీపీలో వీడక పోవటంతో కార్యకర్తలు, నాయకుల్లోనే పూర్తిస్థాయి సంశయం నెలకొంది. -
దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రకటించారు. దర్శి అభ్యర్థిగా మాధవ్ పేరును ఆయన ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాళ్లూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మాధవ్ అందరూ ఆదరించాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కొనసాగింది. తాళ్లూరు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. -
దర్శి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్
-
దర్శి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా మాధవ రెడ్డి
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా బాదం మాధవ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
దొనకొండలో అనకొండలు
ఆక్రమణలిలా.. చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలకల ఫ్యాక్టరీ నుంచి కొండ క్యారీలకు వెళ్లే దారిలో సుమారు 100 ఎకరాల భూమి అన్యాక్రాంతైమైంది. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ రాళ్లు పాతి భూమిని ఆక్రమించారు. పొలాలకు ఉన్న నీటి కుంటలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో అదే గ్రామ పంచాయతీ పరిధిలో బందిళ్లపాయి కొండ దగ్గర సుమారు వంద ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిని లక్షలాది రూపాయలకు కబ్జాదారులు ఇతరులకు విక్రయించారు. దర్శి పట్టణ నడిబొడ్డులోనే 246, 247, 248 సర్వే నంబర్లలో సుమారు పది ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి టీడీపీ ముఖ్యనేత కబంద హస్తాల్లో ఉండటంతో అధికారులు చ ర్యలు తీసుకోలేకపోతున్నారు. లంకోజనపల్లి గ్రామ పంచాయతీలో 80 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామ టీడీపీ నాయకులు కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి జిల్లా అధికారులతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆ భూమిని మాత్రం కబ్జాదారుల చేతుల నుంచి కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైంది. చెక్ డ్యామ్‌నూ ఈ అనకొండలు వదల్లేదు. గతంలో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ నీటి నిల్వలతో చుట్టు పక్కల 50 ఎకరాలకు నీరందించేది. వందలాది మంది రైతుల పంటలు పండించుకునే వారు. ప్రస్తుతం అదికాస్తా ఆక్రమణలకు గురవడంతో ఈ ప్రాంత రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునేదెవరు? దీంతో ఆ ప్రాంతంలోని రైతులు వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నకిలీ రికార్డులు సృష్టించి ఈ భూములను దర్శి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కబ్జాదారులు రిజిస్టర్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని గొప్పగా ప్రకటించిన మంత్రి కళ్ల ముందే ఆక్రమణలు సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆర్ఐని పంపిస్తా: తహశీల్దారు మస్తాన్ ఈ విషయమై డిప్యూటీ తహ శీల్దార్ మస్తాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఆక్రమణలు జరుగుతున్నాయా...వెంటనే ఆర్ఐను పంపి అక్కడ ప్రభుత్వ భూములు పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు. నాలుగు నెలలుగా ఈ తంతు సాగుతున్నా పట్టించుకోకుండా సాక్షి ప్రశ్నించగానే ఇప్పుడే తెలిసినట్టు ... ఆర్ఐని పంపించి పరిశీలిస్తాననడం గమనార్హం. దర్శి : రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను పారిశ్రామిక హబ్‌గా ప్రకటించడంతో దర్శి నియోజకవర్గంలోని భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నోరుమెదపకపోవడం పట్ల విమర్శలకు తావి స్తోంది. దర్శి నియోజకవర్గ పరిధిలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలున్నాయి. వీటి పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు పరిశ్రమల స్థాపనకు అనువు గా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాంతం పై దృష్టిసారించింది. దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. మంత్రి నియోజకవర్గం కావడంతో ఆయన పేరు చెప్పుకుంటూ ... అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. పొక్లెయిన్ల సాయంతో రాత్రికి రాత్రే చదును చేయడమే కాకుండా ఫెన్సింగ్ రాళ్లు పాతి మరీ ఆక్రమిస్తున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.