
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment