farmer mla
-
ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఒక వైపు కాంగ్రెస్ అభ్యర్థులు ఆయా స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో.. మరోవైపు రాజీనామాల పర్వం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా, ఖిల్లా రాయ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జస్బిర్ సింగ్ ఖాన్గుర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సమర్పించారు. తన లేఖలో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు సేవచేసినట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారో మాత్రం ప్రకటించలేదు. కాగా, జస్బిర్ సింగ్.. తండ్రి జగ్పాల్ కూడా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, రాహుల్‌గాంధీ పంజాబ్టూర్లో సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ప్రయత్నం చేశారు. అదే వేదికలో చన్నీ, సిద్దూ.. ఇరువురు నాయకులు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన మరొకరు వారికి.. మద్దతు పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో సీఎం అభ్యర్థి ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది. Jasbir Singh Khangura, former MLA from Qila Raipur in Punjab quits Congress party. pic.twitter.com/4x5VPi4zVB — ANI (@ANI) January 30, 2022 చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ -
బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు బాడీగార్డులు మృతి
రాంచీ:జార్ఖండ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ మావోయిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన మంగళవారం పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జినరువాన్ గ్రామంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై ఒక్కసారిగా మావోయిస్టులు దాడికిదిగారు. దీంతో అప్రమత్తమైన ముగ్గురు బాడీగార్డులు ఎమ్మెల్యేను రక్షించారు. అయితే ఈ దాడిలో ఒక బాడీగార్డు మృతి చెందగా.. మరో బాడీగార్డును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన బాడీగార్డును కూడా హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముగ్గురు బాడీగార్డుల నుంచి ఒక ఏకే-47, రెండు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు లాక్కేళ్లారు. ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే ఫుట్‌బాల్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ముందస్తు సమాచారం అందించలేదని తెలిపారు. గురుచరణ్ నాయక్ గతంలో మనోహర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో అదనపు బలగాలను మోహరించామని, జవాన్ మృతదేహాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని డీజీపీ తెలిపారు. -
దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, దర్శి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో ఒంగోలులో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పర్యాయాలు 1989, 1999లలో దర్శి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిచ్చిరెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. చదవండి: (ఎప్పటికప్పుడు జనన, మరణాల ధ్రువీకరణ) -
సన్యాసం స్వీకరించిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కడప: రాజకీయ సన్యాసం.. రాజకీయాల్లో నేతల మధ్య తరచూ వినిపించే మాట. ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. డాక్టర్ వడ్డెమాను శివరామకృష్ణారావు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఇదే నియోజకవర్గంలోని అట్లూరు మండలం కమలకూరు స్వగ్రామం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఈయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు. 1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు. ముగ్గురు వైద్యులు కావడం, యువకులుగా అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్లో మంత్రి పదవి అవకాశం వచ్చినా తన మిత్రుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం త్యాగం చేసి వైఎస్‌కు అత్యంత సన్నిహితునిగా గుర్తింపు పొందారు. అంతకుముందు శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం 1952లో తొలి జనరల్ ఎలక్షన్లలో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆయన 1962లో బద్వేలు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు శాసనసభ్యునిగా ఎన్నిక కావడం గమనార్హం. బ్రహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు ఐదు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా ఎన్నికైన వైఎస్సార్ ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని భావించినా ఆయన అకాల మరణం శివరామకృష్ణారావుకు ఊహించని షాక్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్, చార్దాం, అమర్నాథ్తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు. మూడు నెలలుగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులైన ఆయన ఎట్టకేలకు సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీ శివరామానంద సరస్వతి ‘సాక్షి’కి తెలిపారు. అందరిలో భగవంతుడు ఉన్నాడని, ఆయన సూచనలతోనే తాను సన్యాస దీక్ష తీసుకున్నానన్నారు. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని చింతతోనే గడపాలన్నది లక్ష్యమన్నారు. మొత్తానికి ఓ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. చదవండి: 58.16 లక్షల మందికి అందిన పింఛన్లు -
అభిమానికి సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం
సాక్షి, గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు ఆయన అభిమాని, చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్నినాయుడు (మిలటరీ నాయుడు) తన కుమారుడు వంశీ సాయంతో విశాఖ విమానాశ్రయానికి వచ్చాడు. పోలీసులు అనుమతించకపోవడంతో వీఐపీ లాంజ్‌కు కొద్ది దూరంలో ప్రయాణికులు వెళ్లే దారి వద్ద వేచి ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో సమావేశం అనంతరం వైఎస్ జగన్ కాన్వాయి శారదా పీఠానికి బయలుదేరింది. పది అడుగులు దాటిన తర్వాత మిలటరీ నాయుడుని చూడగానే ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపించి అతడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. హృదయ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. సీఎం తన వద్దకు వచ్చి పలకరించినందుకు మిలటరీ నాయుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సీఎంకు తన వారిపై ఎంత అభిమానం.. అంటూ అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వారు చర్చించుకున్నారు. నాయుడు టీడీపీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని జీర్ణించుకోలేక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలందిస్తున్నారు. చదవండి: (విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్) -
రూ.70 చార్జీ కోసం టోల్గేట్లో మాజీ ఎమ్మెల్యే తగాదా
చెన్నై, టీ.నగర్: టోల్గేట్లో చార్జీ చెల్లించేందుకు నిరాకరించి సీపీఎం మాజీ ఎమ్మెల్యే తగాదాకు దిగడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. కరూరు– తిరుచ్చి జాతీయ రహదారిలో మనవాసి టోల్‌గేట్‌కు మారుతి ఆల్టో కారులో శనివారం సాయంత్రం 4.30 గంటలకు సీపీఎంకు చెందిన దిండుగల్ మాజీ ఎమ్మెల్యే బాలభారతి వచ్చారు. టోల్గేట్ మీదుగా ఉచితంగా వెళ్లేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యేకు ఉచిత ప్రవేశం లేదని ఉద్యోగులు తెలిపారు. బాలభారతితో వచ్చిన పార్టీ వ్యక్తులు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. మాయనూరు పోలీసులు, టోల్గేట్ అధికారులు వచ్చి బాలభారతితో మాట్లాడారు. ఆమె టోల్ చార్జీ చెల్లించేది లేదని ఖరాఖండిగా తెలిపారు. తర్వాత ఆమెను ఎమ్మెల్యేగా నమోదు చేసి ఉచితంగా పంపివేశారు. 70 రూపాయల చార్జీ చెల్లించాల్సిన వివాదానికి 30 నిమిషాలకు పైగా టోల్గేట్లో మాజీ ఎమ్మెల్యే రోడ్డును అడ్డగించి రాద్దాంతం చేయడంతో వాహనచోదకులు అవస్థలు పడ్డారు. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
సాక్షి, బాపట్ల : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరి రావు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాపట్ల ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ శేషగిరిరావు గతంలో పని చేశారు. 1994-99 మధ్యకాలంలో టీడీపీ తరపున బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి కత్తి పద్మారావుపై విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి మంతెన అనంత వర్మ చేతిలో ఓటిమి పాలయ్యారు. కాగా.. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే మృతి
గన్‌ఫౌండ్రీ: నామినేటెడ్ (ఆంగ్లో ఇండియన్) మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే(64) మంగళవారం మరణించారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో గతవారం చేర్పించారు. కాగా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆమె పార్థివదేహాన్ని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని తన నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం 3గంటలకు గన్‌ఫౌండ్రీలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చికు తీసుకొస్తారు. అనంతరం నారాయణగూడలోని క్యాథలిక్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1994–1999, 1999–2004 వరకు రెండు పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా నామినేట్ అయ్యారు. ఆంగ్లో ఇండియన్ల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి ప్రశంసనీయమని, ఆమె మృతి పట్ల అఖిల భారత ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్యారీ ఓ బ్రెన్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యే హోదాలో ఉండి అప్పు తీర్చుకోలేకపోయారు..
బంజారాహిల్స్: పాతికేళ్ల వయస్సులోనే ఎన్నికల రణరగంలోకి దూకిన ఓ సాదాసీదా ఉద్యోగి కాకలు తీరిన రాజకీయ కురువృద్ధుడ్ని ఓడించి అప్పట్లో రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమయ్యారు. అయితే ఎన్నికల్లో చేసిన అప్పును ఎమ్మెల్యే హోదాలో ఉండికూడా తీర్చుకోలేకపోయారు. ఇప్పటికీ హైదరాబాద్‌లో సొంతిల్లు లేక అద్దెగదిలోనే కాలం వెల్లబుచ్చుతున్న పాలకొలను నారాయణ రెడ్డి (82) ఎమ్మెల్యే కథ ఆసక్తికరం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి 1966–1967 శాసనసభ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన సీ.రాజగోపాల చారి అలియాస్ రాజాజీ స్వతంత్ర పార్టీ పేరుతో ఓ పార్టీని నెలకొల్పారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కుర్రాళ్లను రంగంలోకి దింపారు. హైకోర్టులో ఉద్యోగం చేస్తున్న నారాయణ రెడ్డి కూడా సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తుండడంతో మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా పిలుపొచ్చింది. అయితే అక్కడ కాకలు తీరిన కాంగ్రెస్ అభ్యర్థి ఉండటంతో ఆయనతో పోటీ చేసి గెలవడం కష్టమని నారాయణ రెడ్డి వెనకడుగు వేసి తనవద్ద అంత డబ్బు కూడా లేదని చెప్పారు. నువ్వు తప్పకుండా గెలుస్తావు ఎన్నికల ఖర్చుకింద 2వేలు ఉంచుకోవాలంటూ రాజాజీ బలవంతంగా ఎన్నికల క్షేత్రంలోకి దింపారు. గెలిచినా, ఓడినా పెద్ద నష్టమేమీ లేదనుకున్న నారాయణ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ రేపనగా పార్టీలో చేరి ప్రచారంలో ఊరూరా తిరిగాడు. వారం గడిచిన తర్వాత ఆయనకు మద్దతుగా ఉవ్వెత్తున ఊర్లు కదలివచ్చాయి. రూ.10 వేలు అప్పుచేసి రాజాజీ ఇచ్చిన రూ.2 వేలు కలిపి ఆ ఎన్నికల్లో మెత్తం రూ.12 వేలు ఖర్చుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు తాను గెలవడమేంటని అనుకుని హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను గెలిచిన విషయాన్ని రాత్రి రేడియోలో చెప్పేదాకా నమ్మలేకపోయానన్నారు. అప్పుడు కడపలో స్వతంత్ర పార్టీ నుండి 7 మంది పోటీ చేస్తే 7 మందీ గెలిచారని గుర్తుచేసుకున్నారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సభలో తాను ఎమ్మెల్యేనని నీతి, నిజాయతీతో సేవలందించానని ఒక్క రూపాయి కూడా అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు. అయితే అప్పుడు కూడా ఫిరాయింపులు, ఆకర్ష పథకాలు ఉండేవని తాను కాంగ్రెస్‌లో చేరితే ఆ తర్వాత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చి మంత్రిపదవి కూడా ఇస్తామని ప్రలోభపెట్టినా తాను జంప్ కాలేదని, నమ్మిన పార్టీతోనే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. గడ్డిఅన్నారం డివిజన్లో ప్రచారంలో భాగంగా కూరగాయలు అమ్ముతున్నఎల్‌బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అప్పుడు స్వతంత్ర పార్టీ నుండి గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రలోభాలకు గురికాకుండా నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. అప్పుడు తన నెలజీతం రూ.250 ఉండేదని, ఎన్నికలకోసం చేసిన రూ.3 వేల అప్పు కూడా మాజీ అయిన తర్వాత కూడా తీర్చుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో రూ.7వేలు అద్దె చెల్లిస్తూ రెండు గదుల ఇంటిలో ఉంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని, ఇప్పుడు అన్ని ప్రలోభాలు ఫిరాయింపులే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్చ రాజకీయాలు పూర్తిగా కనుమరుగయ్యాయని, పక్క పార్టీ నుండి ఎమ్మెల్యేలను లాక్కోవడమే పనిగా పెట్టుకుని అదే అభివృద్ది అంటూ జబ్బలు చరుచుకుటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలంటే ఇప్పుడున్న ప్రజలకు గౌరవం పోతుందని మళ్ళీ అప్పటిరోజులు రావాలంటే కొత్త నాయకులు పుట్టాల్సిందే అన్నారు. ఇప్పటి ఎన్నికల ప్రచార తీరుతెన్నులు కూడా అసహ్యంగా ఉన్నాయని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంతోనే సరిపెట్టుకుటున్నారు తప్పితే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాటం చేయాలని, ఏ అభ్యర్థి కూడా అనుకోవడంలేదన్నారు. ఇప్పుడు అంతా డబ్బుతో ప్రచారమని, తమ కాలంలో ఊరూరా తిరిగితే ప్రచారమని ప్రచారతీరును పోల్చారు. -
27న వైఎస్సార్సీపీలోకి అత్తిలి మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈ నెల 27న వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనిం తన నివాసంలో గురువారం శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో 27న భీమవరంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎన్నికల కో–ఆర్డినేటర్‌గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించానని, అభిమానులు, అనుచరుల ఆకాంక్ష మేరకు టీడీపీకి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరి పెద్దిరాజు, వెలగల సాయిబాబారెడ్డి, కేవీఎన్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
నాకు..నా బిడ్డకు టిక్కెట్లు!
సాక్షి, మహబూబాబాద్: వచ్చే ఎన్నికల్లో తనకు, తన కూతురు, మాజీ ఎమ్మెల్యే కవితకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని డోర్నకల్ ఎమ్మె ల్యే రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెడ్యా వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో తెలియక శ్రేణులన్నీ ఆలోచనల్లో తలమునకలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెడ్యానాయక్, ఆయన కూతురు మాలోతు కవిత పోటీచేశారు. రెడ్యానాయక్ టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌పై గెలిచి, ఆతర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కవిత టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా ఎమ్మెల్యేతో కలిసి ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, నియోజకవర్గంలోనే పర్యటిస్తూ తన అనుచరులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో సత్యవతిరాథోడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వారు పావులు కదుపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచిన, ఓడిన అభ్యర్థులు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పనిచేస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా సిట్టింగ్‌లకు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు ఇచ్చి నియోజకవర్గాలకు పంపుతానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆ ర్ పదేపదే ఇలా చెప్పడంతో ఆశావహులు సీఎం వ్యా ఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీలో పలువురికి పదవులను కట్టబెట్టారు. ఇందులో భాగంగా డోర్నకల్ టికె ట్ ఆశిస్తున్న సత్యవతిరాథోడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, మహబూబాబాద్‌లో టికెట్ ఆశిస్తున్న కవిత కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. టిక్కెట్లు సర్థుబాటు చేయలేని వారికే పార్టీ పదవులను ఇచ్చారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అందుకే సత్యవతిరాథోడ్ నియోజకవర్గంలో తిరగడాన్ని తగ్గించుకుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవతి అనుచరులను రెడ్యానాయక్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా ఉంది. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో రేపో, మాపో సత్యవతి వర్గీయులు రెడ్యా వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కానీ, మహబూబాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెడ్యానాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత నియోజవర్గంలో సిట్టింగు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తగ్గకుండా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు, జనానికి ఎమ్మెల్యేతో పోటీపడుతూ పరామర్శిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. శంకర్‌నాయక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడనే ఆలోచనలో ఉన్న ఆమె తనకే టికెట్టు ఖచ్చితంగా వస్తుందనే భావనలో ఉన్నారు. రెడ్యా వ్యాఖ్యలతో... అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెడ్యానాయక్ వచ్చే ఎన్నికల్లో ‘నాకు.. నా కూతురుకు టిక్కెట్లు’ అని వ్యాఖ్యలు చేశారు. రెడ్యా వ్యాఖ్యల తీరు, నియోజకవర్గంలో కవిత పర్యటిస్తున్న జోరు చూస్తుంటే డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, మహబూబాబాద్‌లో కవితకు టిక్కెట్లు వస్తాయనే భావన కలుగుతోంది. కానీ, ఒకే కుటుంబంలో తండ్రీ కూతుళ్లకు టిక్కెట్లు ఇస్తారా? మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి అధికార పార్టీలో చేరిన ఆశావాహుల సంగతేంటి? ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఇస్తే రాష్ట్రంలోనూ మరెన్నో కుటుంబాల నుంచి ఈ డిమాండ్ వస్తుందనే చర్చ జరుగుతోంది. రెడ్యానాయక్ ఎంపీగా పోటీచేస్తారని, కవిత డోర్నకల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని.. అలా రెడ్యానాయక్ రెండు టికెట్లు అని ప్రకటించి ఉంటారని మరో చర్చ వినిపిస్తోంది. అదే నిజమనుకుంటే రెడ్యానాయక్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు రవిచంద్రనాయక్ ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారనే విషయం కూడా ఉంది. అదీకాక రెడ్యానాయక్ వ్యూహాత్మకంగా తన మనస్సులో ఉన్న మాటను అధిష్టానానికి తెలియజేసేందుకు ఈ ప్రకటన చేశారనే వాదన కూడా లేకపోలేదు. మొత్తానికి రెడ్యానాయక్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శంకర్‌నాయక్ కూడా ఎంత వరకైనా సరే నియోజకవర్గాన్ని, టిక్కెట్టును వదిలేది లేదనే పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులకే సీట్లన్న సీఎం కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా రెడ్యానాయక్ మాట్లాడటం, కవిత వ్యవహరిస్తుండటం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని శంకర్‌నాయక్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జిల్లాలో రెడ్యానాయక్ వ్యాఖ్యల అంతరార్థమేమిటో అంతుబట్టక టీఆర్ఎస్ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
డిసెంబర్లో కొత్త పార్టీ
కోలారు: డిసెంబర్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ వెల్లడించారు. బెగ్లిహసహళ్లి గ్రామ సమీపంలోని తన ఫాం హౌస్‌లో మంగళవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య, మంత్రి రమేష్కుమార్లు అసలైన కాంగ్రెస్ వాదులు కాదని, వారు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారన్నారు. సీఎం సిద్దరామయ్య మంత్రి రమేష్‌కుమార్ మాటలు విని తనను కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావద్దని ఫోన్ చేసి చెప్పారన్నారు. దీని వల్ల తన స్వాభిమానం దెబ్బతిందని అన్నారు. శ్రేయోభిలాషుల సలహా మేరకు నమ్మ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను కోలారు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి
భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శనివారం పట్టణంలో జరుగుతున్న బంద్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడున్న సమయంలో ఉన్నట్టుండి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.