
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్
కోలారు: డిసెంబర్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ వెల్లడించారు. బెగ్లిహసహళ్లి గ్రామ సమీపంలోని తన ఫాం హౌస్‌లో మంగళవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య, మంత్రి రమేష్‌కుమార్‌లు అసలైన కాంగ్రెస్ వాదులు కాదని, వారు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారన్నారు. సీఎం సిద్దరామయ్య మంత్రి రమేష్‌కుమార్ మాటలు విని తనను కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావద్దని ఫోన్ చేసి చెప్పారన్నారు.
దీని వల్ల తన స్వాభిమానం దెబ్బతిందని అన్నారు. శ్రేయోభిలాషుల సలహా మేరకు నమ్మ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను కోలారు నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment