సాక్షి, గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఆయన అభిమాని, చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్నినాయుడు (మిలటరీ నాయుడు) తన కుమారుడు వంశీ సాయంతో విశాఖ విమానాశ్రయానికి వచ్చాడు. పోలీసులు అనుమతించకపోవడంతో వీఐపీ లాంజ్‌కు కొద్ది దూరంలో ప్రయాణికులు వెళ్లే దారి వద్ద వేచి ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో సమావేశం అనంతరం వైఎస్ జగన్ కాన్వాయి శారదా పీఠానికి బయలుదేరింది. పది అడుగులు దాటిన తర్వాత మిలటరీ నాయుడుని చూడగానే ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపించి అతడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. హృదయ పూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. సీఎం తన వద్దకు వచ్చి పలకరించినందుకు మిలటరీ నాయుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సీఎంకు తన వారిపై ఎంత అభిమానం.. అంటూ అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వారు చర్చించుకున్నారు. నాయుడు టీడీపీలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్‌టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని జీర్ణించుకోలేక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment