
తాడేపల్లిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 27న వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు అత్తిలి మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనిం తన నివాసంలో గురువారం శ్రీరంగనాథరాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో 27న భీమవరంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో జిల్లా ఎన్నికల కో–ఆర్డినేటర్‌గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించానని, అభిమానులు, అనుచరుల ఆకాంక్ష మేరకు టీడీపీకి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గుంటూరి పెద్దిరాజు, వెలగల సాయిబాబారెడ్డి, కేవీఎన్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment