సాక్షి, బాపట్ల : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరి రావు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాపట్ల ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ శేషగిరిరావు గతంలో పని చేశారు. 1994-99 మధ్యకాలంలో టీడీపీ తరపున బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి కత్తి పద్మారావుపై విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి మంతెన అనంత వర్మ చేతిలో ఓటిమి పాలయ్యారు. కాగా.. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment