Muppalaneni Seshagirirao
-
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..!
సాక్షి, బాపట్ల : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాపట్ల మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరి రావు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాపట్ల ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ శేషగిరిరావు గతంలో పని చేశారు. 1994-99 మధ్యకాలంలో టీడీపీ తరపున బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి కత్తి పద్మారావుపై విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరి మంతెన అనంత వర్మ చేతిలో ఓటిమి పాలయ్యారు. కాగా.. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని
హైదరాబాద్: మాజీ మంత్రి, జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు కుమారుడు శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. వీరిద్దరికి చంద్రబాబు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా వెల్లడైన వివిధ సర్వేల ఫలితాల్లో టీడీపీ పుంజుకుంటోందని వెల్లైడెందన్నారు. వైఎస్సార్సీపీ బలం తగ్గిపోతోందన్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి తనకే ఉందని భావించి పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పితాని మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేయటంతోనే తాము బైటకు వచ్చామన్నారు.