
వార్నర్ సెంచరీ: ఆసీస్ కు శుభారంభం
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్ట్ లో ఆసీస్ కు శుభారంభం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఆసీస్ ఓపెనర్లు వార్నర్, రోజర్స్ లు ధాటిగా బ్యాటింగ్ ఆరంభించారు. వార్నర్(108 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ నమోదు చేయగా, రోజర్స్(79)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ఈ సెంచరీతో వార్నర్ టెస్టుల్లో 12 సెంచరీలను నెలకొల్పాడు. ప్రస్తుతం ఆసీస్ వికెట్ నష్టపోకుండా 41.1 ఓవర్లలో 187 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది.