సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్ని మైదానంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆసీస్ ఆట ఆరంభమైంది. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ 93.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 353 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(83) పరుగులు, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు.
మొదటి రోజు మ్యాచ్.. తొలి సెషన్‌లో ఆసీస్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతూ భారత్ బౌలర్ల ఎత్తులను చిత్తుచేశారు. విసిరిన బంతులను విసిరినట్టే వరుసగా బౌండరీలు దాటించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 348 పరుగులతో భారీ స్కోరును నమోదు చేసింది. తొలిరోజు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టులో ఓపెనర్లగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.
సిడ్నీ: రెండో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా
Published Wed, Jan 7 2015 5:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement