48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్ | India lost first wicket on 5th day of Test match | Sakshi
Sakshi News home page

48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్

Published Sat, Jan 10 2015 6:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

India lost first wicket on 5th day of Test match

సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (46 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్గా క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (0) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 16.6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 48 పరుగులతో కొనసాగుతోంది.

అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement