
తొలి రోజు ఆసీస్ స్కోరు 348/2
టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ తొలిరోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది.
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. ప్రస్తుతం షేన్ వాట్సన్ , కెప్టెన్ స్టీవ్ స్మిత్ లు హాఫ్ సెంచరీలతో క్రీజ్ లో ఉన్నారు. స్మిత్(82) పరుగులు చేసి మరోసారి ఆకట్టుకోగా, అతనికి జతగా వాట్సన్ (62) పరుగులతో ఆడుతున్నాడు.
అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.