లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2 | 4th Test-3rd day: India Lunch break Score 122/2 | Sakshi
Sakshi News home page

లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2

Published Thu, Jan 8 2015 7:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు),  భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ 118 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మురళీ విజయ్ (0), రోహిత్ శర్మ(53) పరుగులు చేసి పెవిలియన్ చేరారు.  ఆ తరువాత బరిలోకి దిగిన భారత్ ఆటగాడు రాహుల్, కెప్టెన్ వీరాట్ కోహ్లీ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, లయోన్ తలో వికెట్ తీసుకోన్నారు. కాగా,  భారత్ ప్రస్తుతం మరో 450 పరుగులు వెనుకబడి ఉంది.

రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అదే రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement