T20 World Cup 2022- India Vs Netherlands: పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడా? కండరాల నొప్పితో బాధపడిన అతడు నెదర్లాండ్స్‌తో తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడా? కీలక మ్యాచ్‌లకు సన్నద్ధం చేసేందుకు మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినివ్వనుందా?
అసలు పాండ్యా ఫిట్‌గానే ఉన్నాడా? లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పవు! అంటూ అభిమానుల్లో ఆందోళనల రేకెత్తిన వేళ భారత బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే స్పందించాడు. పాండ్యా ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు. మ్యాచ్ డేందుకు అన్ని రకాలుగా అతడు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.
అదరగొట్టాడు కదా!
టీ20 ప్రపంచకప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లి(82, నాటౌట్)తో పాటు హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 పరుగులు చేయడం సహా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, మ్యాచ్ ముగిసే సమయంలో అతడు కండరాల నొప్పితో ఇబ్బందికి గురైనట్లు సమాచారం.
అతడు లేకపోతే ఎట్లా?
ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు అతడికి విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావించినట్లు వార్తలు రాగా.. పారస్ మాంబ్రే వాటిని కొట్టిపడేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడుతూ.. ‘‘నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు మేము ఎవరికీ విశ్రాంతినివ్వడం లేదు. టోర్నీలో మొమెంటం కొనసాగించాలనుకుంటున్నాం.
ఫామ్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా జట్టులో ఉంటారు’’ అంటూ తొలి విజయం ఇచ్చిన జోష్ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామని వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక సభ్యుడని.. అతడు అన్ని మ్యాచ్‌లు ఆడతాడని పేర్కొన్నాడు. పాక్‌తో మ్యాచ్ సమయంలో ఈ ఆల్‌రౌండర్ రాణించిన తీరు, ఆటిట్యూడ్ గురించి ఈ సందర్భంగా పారస్ మాంబ్రే ప్రస్తావించాడు.
తదుపరి మ్యాచ్‌లలో
క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లికి పాండ్యా అండగా నిలబడ్డ తీరును కొనియాడాడు. కాగా నెదర్లాండ్స్‌తో సిడ్నీలో మ్యాచ్ నేపథ్యంలో పాండ్యాకు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో దీపక్ హుడాకు ఛాన్స్ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇక సూపర్-12లో నెదర్లాండ్స్ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మిగిలిన మ్యాచ్‌లు ఆడనుంది.
ఇవి కూడా చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్
WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా
Ravichandran Ashwin: చంద్రముఖిలా మారిన కోహ్లి.. ముందుగా డీకేను తిట్టుకున్నాను! ఆ తర్వాత
T20 WC 2022: ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే!
Comments
Please login to add a commentAdd a comment