
ఉమేష్ యాదవ్.. ఓ చెత్త రికార్డు!
అతడు వేసింది సరిగ్గా మూడంటే మూడు ఓవర్లు.. ఇచ్చింది 45 పరుగులు.. తీసిన వికెట్టు ఒక్కటీ లేదు. ఆస్ట్రేలియాపై సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు నాలుగోరోజు భారత బౌలర్ ఉమేష్ యాదవ్ నమోదు చేసిన అతి చెత్త రికార్డు ఇది. ఇంతవరకు ఏ దేశంలోనూ భారత బౌలర్ ఎవరూ ఇంత చెత్త బౌలింగు చేయలేదని రికార్డులు చెబుతున్నాయి.
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఒక్కొక్కరు విరుచుకుపడుతుంటే ఉమేష్ యాదవ్ తన వద్ద బంతులే లేనట్లు నిమ్మకుండిపోయాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండులో అతడిని దొరకబుచ్చుకుని మరీ బ్యాట్స్మెన్ ఆడుకున్నారు. దీంతో సిరీస్ మొత్తమ్మీద ఇంతవరకు ఏ భారత బౌలర్ టెస్టు క్రికెట్లో నమోదు చేయనంత ఘోరమైన ఎకానమీ రేటును ఉమేష్ యాదవ్ నమోదు చేశాడు. సగటున ఒక్కో ఓవర్కు అతడు 15 పరుగులు ఇచ్చినట్లయింది.