
ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం: రోహిత్ శర్మ
గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమైన భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేశాడు. భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో గాయపడిన రోహిత్ తొడకు లండన్‌లో శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాస శిబిరంలో పాల్గొన్న అతనికి ఎన్‌సీఏ సహాయక సిబ్బంది తోడ్పాటునందించిందని పేర్కొన్నాడు. ఆసీస్‌తో సిరీస్ సమయానికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంటానని చెప్పాడు.