బంగ్లాదేశ్‌తో జరగిన రెండో వన్డే భారత్ ఓటమి పాలైనప్పటికీ... కెప్టెన్ రోహిత్ శర్మ విరోచిత పోరాటానికి మాత్రం అభిమానులు పిధా అయిపోయారు. ఒక వైపు బొటన వేలి గాయంతో భాదపడతునే అఖరి బంతి వరకు రోహిత్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. హిట్‌మ్యాన్ తన సునామీ ఇన్నింగ్స్‌తో బంగ్లా జట్టుకు చెమటలు పట్టించాడు. అఖరి బంతికి భారత విజయం సాధించాలంటే ఒక సిక్సర్ అవసరమైంది.
ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తద్వారా సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో బంగ్లా సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇక మ్యాచ్ అనంతరం పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌ను ప్రత్యర్థి జట్టు అభిమానులు సైతం చప్పట్లతో అభినందించారు. అదే విధంగా విరోచిత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్.. ఓడిపోయినా మాకు ఏ బాధ లేదంటూ" నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు చేస్తున్నారు.
What a fight with injured thumb🙏🏽🙏🏽🙏🏽🙏🏽 #RohitSharma#Respect pic.twitter.com/pQpYTMVgNS
— vennela kishore (@vennelakishore) December 7, 2022
🙌 𝐎 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧, 𝐦𝐲 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧!
— The Bharat Army (@thebharatarmy) December 7, 2022
💙 We are proud to have such an inspiring leader!
👏 Chin up, Skip. You did your best!
📷 Getty • #RohitSharma #INDvBAN #BANvIND #TeamIndia #BharatArmy pic.twitter.com/OvEonl3rAG
చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..
Comments
Please login to add a commentAdd a comment