బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అనముల్ హక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. స్లిప్‌లో క్యాచ్ పట్టే క్రమంలో రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో రోహిత్ నొప్పితో వెంటనే ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు.
అతడి స్థానంలో రజిత్ పటిదార్ సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయపడిన రోహిత్‌ను వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరిలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. రెండో వన్డే ఫీల్డింగ్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది.
Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw
— BCCI (@BCCI) December 7, 2022
బీసీసీఐ వైద్య బృందం అతడిని స్కానింగ్ కోసం పంపించింది అంటూ బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్‌కు వచ్చేది అనుమానంగా మారింది. కాగా రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని రోహిత సేన భావిస్తోంది.
pic.twitter.com/SoOLqQYLn1#RohitSharma
— Shivam Rajvanshi (@social_timepass) December 7, 2022
చదవండి: Rohit Sharma: ఒక్క మ్యాచ్‌కే తప్పించారా? కుల్దీప్‌ను పక్కనపెట్టడానికి కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment