వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు ముందు రోజు ఓ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇన్ని రోజులు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండిన భారత ఆటగాళ్లు, మ్యాచ్‌కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉందనగా దెబ్బలు తగిలించుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ స్వల్పంగా గాయపడగా.. తాజాగా (ఇవాళ) జట్టు సారధి రోహిత్ శర్మ చేతి వేలికి దెబ్బతగిలించుకున్నాడు. గాయం తీవ్రత తదితర విషయాలపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రోహిత్ ఎడమ చేతి వేలికి బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటూ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఇది చూసి భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అని విచారించుకుంటున్నారు. రోహిత్ గాయంపై పూర్తి సమాచారం కొరకు గూగుల్ చేస్తున్నారు. రోహిత్ గాయం వార్త నిజమా లేక ఫేక్ న్యూసా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం హిట్ మ్యాన్ ప్రాక్టీస్‌కు రాకుండా రెస్ట్ తీసుకున్నాడు. రోహిత్ చేతి వేలికి స్కానింగ్ కూడా చేసినట్లు సమాచారం.
కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్‌స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చాలా రోజులుగా కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లలోని ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఆసీస్ తరఫున హాజిల్‌వుడ్, తాజాగా టీమిండియా తరఫున రోహిత్ శర్మ గాయపడ్డారు. మరి హిట్‌మ్యాన్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడా లేక గాయం వార్త ఫేక్ న్యూసా తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్
చదవండి: WTC Final: ఆస్ట్రేలియా తుది జట్టులో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment