
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.కామెరాన్ గ్రీన్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ 33, తిలక్ వర్మ 26, నిహాల్ వదేరా 23 పరుగులతో రాణించారు.
ఇక జట్టులో ఒక్కరు కూడా ఫిఫ్టీ మార్క్ అందుకోనప్పటికి ప్లేఆఫ్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ తొలిస్థానంలో నిలిచింది. ఇంతకముందు 2018 ఫైనల్‌లో సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ 178 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఒక్క ఫిఫ్టీ కూడా నమోదు కాలేదు. 2018లోనే క్వాలిఫయర్-2లో ఎస్‌ఆర్‌హెచ్.. కేకేఆర్‌పై 174 పరుగులు, 2013 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 165 పరుగులు, 2008 ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌పై సీఎస్‌కే 163 పరుగులు చేసింది.