
అడిలైడ్: ‘యాషెస్’ సిరీస్ రెండో టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన వెంటనే రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం మ్యాచ్‌ను నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ఆట సాగుతున్న సమయంలో ఓవల్ మైదానానికి సమీపంలోనే పిడుగు పడటంతో వెంటనే ఆటను ఆపేశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 473 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. లబుషేన్ (103; 8 ఫోర్లు) సెంచరీ చేశాడు. స్మిత్ (93; 12 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం ఆ అవకాశం కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment