గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి! | Leo Movie Director Lokesh Kanagaraj Injured During Kerala Visit | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‪‌కి గాయం.. అందుకే ఇలా!

Published Tue, Oct 24 2023 4:14 PM | Last Updated on Tue, Oct 24 2023 4:24 PM

Leo Movie Director Lokesh Kanagaraj Injured In Kerala Tour - Sakshi

లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది.

(ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?)

'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్‌ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్‌లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్‌లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్.

పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌కి వెళ్లి ఫ్యాన్స్‌తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement