Kajol Injured, Spotted Walking With Elbow Crutch In Mumbai Goes Viral - Sakshi
Sakshi News home page

Kajol: నడవలేకపోతున్న కాజోల్.. ఆరా తీస్తున్నా ఫ్యాన్స్!

Published Wed, Aug 16 2023 1:47 PM | Last Updated on Wed, Aug 16 2023 2:38 PM

Kajol Injured Spotted Walking With Elbow Crutch In Mumbai Goes Viral - Sakshi

బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్‌ సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! )

ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్‌కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్‌కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్‌తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement