అర్జున్‌ టెండూల్కర్‌కు గాయం.. ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే | Arjun Tendulkar Injury MI Replace Simarjeet Singh IPL 2021 2nd Phase | Sakshi
Sakshi News home page

IPL 2021: అర్జున్‌ టెండూల్కర్‌కు గాయం.. అతని స్థానంలో

Published Wed, Sep 29 2021 7:27 PM | Last Updated on Wed, Sep 29 2021 9:45 PM

Arjun Tendulkar Injury MI Replace Simarjeet Singh IPL 2021 2nd Phase - Sakshi

Courtesy: IPL Twitter

Arjun Tendulkar Injury Ruled Out IPL 2021.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ గాయంతో ఐపీఎల్‌ 2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.  గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అర్జున్‌ ముంబై తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్‌ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్‌ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అర్జున్‌ ముంబై తరపున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రెండో టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: IPL 2021: ఫామ్‌లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే


కాగా గాయంతో దూరమైన అర్జున్‌ టెండూల్కర్‌ స్థానంలో రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ సిమర్‌జీత్‌ సింగ్‌ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్‌ తన ట్విటర్‌లో ప్రకటించింది. కాగా 23 ఏళ్ల సిమర్‌జీత్‌ సింగ్‌ దేశవాలి క్రికెట్‌లో 10 ఫస్ట్‌క్లాస్‌, 19 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు.. 15 టి20లు ఆడి మొత్తంగా 74 వికెట్లు పడగొట్టాడు. అయితే సిమర్‌జీత్‌ సింగ్‌ గత జూలైలో శ్రీలంకలో పర్యటించిన టీమిండియా జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. 

చదవండి: IPL 2021: ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్‌, రోహిత్‌ క్రీడాస్పూర్తికి రాహుల్‌ ఫిదా

Ashwin Vs Morgan: మోర్గాన్‌ తప్పు లేదు.. అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement