'ఆ ప్రమాదం వల్లే యాక్టివ్‌గా లేను'.. పుష్ప భామ రష్మిక పోస్ట్ వైరల్! | Rashmika Mandanna Suffers From Minor Accident, Share Health Update | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: 'ప్రమాదానికి గురయ్యా.. అందుకే దూరంగా ఉన్నా'

Published Mon, Sep 9 2024 7:30 PM | Last Updated on Mon, Sep 9 2024 8:23 PM

Rashmika Mandanna Suffers From Minor Accident, Share Health Update

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2లో కనిపించనుంది. బన్నీ- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి అభిమానులను అలరించనుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంద డి చేయనుంది. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన షూటింగ్‌ పెండింగ్‌లో ఉండడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఎందుకంటే గత నెల రోజులుగా యాక్టివ్‌గా లేకపోవడానికి ఓ కారణం ఉందని వెల్లడించింది. నాకు చిన్న ప్రమాదం జరిగిందని.. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని శ్రీవల్లి చెప్పుకొచ్చింది. డాక్టర్ల సలహాతో కోలుకున్నానని.. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి నా రోజువారీ కార్యకలాపాలతో యాక్టివ్‌గా ఉంటానని రాసుకొచ్చింది.

అంతే కాకుండా 'మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి.. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది.. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు.. అందుకే ప్రతి రోజు సంతోషంగా జీవించండి' అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది ముద్దుగుమ్మ. త్వరలోనే ఫుల్‌గా లడ్డులు తింటూ మరో అప్‌డేట్‌ ఇస్తానని ఫన్నీగా పోస్ట్ చేసింది రష్మిక. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement