ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా: మెగాస్టార్ ట్వీట్ | Megastar Tweet On Ex Telangana Chief Minister KCR Injury | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆశిస్తున్నా: చిరు ట్వీట్

Published Fri, Dec 8 2023 6:38 PM | Last Updated on Fri, Dec 8 2023 7:03 PM

Megastar Tweet On Ex Telangana Chief Minister KCR Injury - Sakshi

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.  కేసీఆర్ సార్‌కు  గాయమైందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు.  ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

ఇప్పటికే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ ఆరా తీశారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. 

కాగా.. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్‌ హిట్‌ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్‌ తీసుకుని పక్కా ప్లాన్‌తో చిరంజీవి కోసం కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్‌ ద్వార  విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement