
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది.
దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్‌ను విడిచి పెట్టి వెళ్లాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి వారం రోజులు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు స్థానంలో డెత్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్‌కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది.
చదవండి: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment