ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్ | Telugu Actor Raviteja Discharge From Hospital | Sakshi
Sakshi News home page

Raviteja: సర్జరీ పూర్తి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Published Sat, Aug 24 2024 1:21 PM | Last Updated on Sat, Aug 24 2024 1:31 PM

Telugu Actor Raviteja Discharge From Hospital

తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

రీసెంట్‌గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్‌లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆ‍స్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్‌ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement