పదునైన పేస్ బౌలింగ్‌తో ఈ ఐపీఎల్‌లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.
తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు.
ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగో ఓవర్‌లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment