T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌..  | Shakib Al Hasan Ruled Out Of T20 World Cup 2021 Due To Injury | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. 

Published Sun, Oct 31 2021 9:11 PM | Last Updated on Sun, Oct 31 2021 9:11 PM

Shakib Al Hasan Ruled Out Of T20 World Cup 2021 Due To Injury - Sakshi

Shakib Al Hasan Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో బంగ్లాదేశ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. సూపర్‌-12లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు ఇది మరో మింగుడుపడని విషయం.

కాగా, షకీబ్‌ ప్రస్తుత మెగా టోర్నీలో బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తంలో 6 మ్యాచ్‌లు ఆడిన షకీబ్‌ 21.83 సగటుతో 131 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు ఈ టోర్నీలో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నవంబర్‌ 2న దక్షిణాఫ్రికా, 4న ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్‌ తలపడాల్సి ఉంది.
చదవండి: క్రికెట్‌ ఆస్ట్రేలియాలో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు దిగ్గజాల కన్నుమూత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement