
సోషల్ మీడియాలో చతుర్లు విసిరే కేటీఆర్.. ఇప్పుడు సరదా సంభాషణకు కారణం..
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ కాలి చీలమండ కండరం గాయంతో బాధపడుతూ మూడు వారాల విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన.
ఈ క్రమంలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిఫర్ చేయాలంటూ ఆయన నెటిజన్స్‌ని కోరారు. ఇక ఇప్పుడు ఐటీ మంత్రి కేటీ రామారావు తన విభాగం ఫైల్స్‌ను చూస్తున్న ఫొటోను మంగళవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వర్క్‌ఫ్రమ్ హోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j
— KTR (@KTRTRS) July 26, 2022
చదవండి: కేటీఆర్ కోసం మోకాళ్లపై గుడి మెట్లెక్కిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య