టీమిండియాకు మరో బిగ్‌ షాక్‌.. ఆ స్టార్‌ ఆటగాడు దూరం! | Hardik Pandya Taken For Scan After Being Hit On Shoulder In Match Against Pakistan | Sakshi
Sakshi News home page

Hardik Pandya Injury: టీమిండియాకు మరో బిగ్‌ షాక్‌.. ఆ స్టార్‌ ఆటగాడు దూరం!

Published Mon, Oct 25 2021 2:09 PM | Last Updated on Tue, Oct 26 2021 7:40 AM

Hardik Pandya Taken For Scan After Being Hit On Shoulder In Match Against Pakistan - Sakshi

Hardik Pandya Taken For Scan After Being Hit On Shoulder In Match Against Pakistan: టీ20 వరల్డ్‌కప్‌-2021లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11 పరుగుల వద్ద అతడి కుడి భుజానికి గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్‎కు రాలేదు. పాండ్యా స్ధానంలో ఇషన్‌ కిషన్‌ ఫీల్డింగ్‌ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను  స్కానింగ్‎కు పంపినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

దీంతో న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు  హార్దిక్‌ అందుబాటుపై సందిగ్దత నెలకొంది. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 11 పరుగులే చేసి హార్దిక్‌ పెవిలియన్‌కు చేరాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

చదవండి: Ashish Nehra: రిజ్వాన్‌, బాబర్‌ చాలా బాగా బ్యాటింగ్‌ చేశారు.. అయితే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement