భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని స్థానంలో దూకుడుగా ఉండే యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని నియమించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని స్థానంలో దూకుడుగా ఉండే యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లిని నియమించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు.
‘పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ధోని చాలా తెలివైన నాయకుడు. అయితే టెస్టు ఫార్మాట్‌లో మాత్రం పరధ్యానంలో ఉన్న ప్రొఫెసర్ పార్క్‌లో తిరుగుతున్నట్టు కనిపిస్తాడు. కోహ్లి రూపంలో జట్టుకు మంచి ప్రత్యామ్నాయ కెప్టెన్ ఉన్నాడు. ఆసియాకప్‌లో తను విజయవంతమైతే టెస్టు ఫార్మాట్‌కు కోహ్లినే సారథిగా నియమించాలి’ అని చాపెల్ అన్నారు.