న్యూఢిల్లీ: భారత్‌కు వన్డేల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోనిని.. ఇతర సారథులతో పోల్చలేమని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే రికార్డులను బట్టి చూస్తే తన సీనియర్లందర్నీ మహీ అధిగమించాడన్నారు. ‘ఓ 50, 100 మ్యాచ్‌ల తర్వాత గణాంకాలను పరిశీలిస్తే నిలకడ ఎవరిదనేది కచ్చితమైన అంచనాకు రావొచ్చు. అయితే భిన్నమైన శకాల్లో సారథ్యం వహించిన ఇతర కెప్టెన్లతో అతన్ని పోల్చడం సరైంది కాదని నా అభిప్రాయం. కానీ గణాంకాల పరంగా చూస్తే అతనే టాప్‌లో ఉంటాడు.
ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు. పొట్టి ఫార్మాట్‌లకు మాత్రం అతను అనుకూలమైన నాయకుడు’ అని సన్నీ వివరించారు. విదేశాల్లో భారత్ వన్డే రికార్డు బాగానే ఉన్నప్పటికీ తన ఉద్దేశంలో టెస్టు ఫార్మాట్‌కు మించింది మరోటి లేదన్నారు. ‘టెస్టుల్లో ఇంగ్లండ్ ఆడిన దానికంటే వన్డేల్లో భారత్ చాలా మెరుగైన ప్రదర్శన చూపింది. అయితే ఎప్పటికైనా టెస్టులే నంబర్‌వన్. కాబట్టి ఇంగ్లండ్‌లో టెస్టు పరాభ వాన్ని ఎప్పటికీ మర్చిపోలేం’ అని గవాస్కర్ పేర్కొన్నారు.
ధోనిని ఇతరులతో పోల్చలేం: గవాస్కర్
Published Thu, Sep 4 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement